రుణ భారంతో కొట్టుమిట్టాడుతున్న వొడాఫోన్ ఐడియాకు భారీ జరిమానా రూపంలో ట్రాయ్ షాకిచ్చింది. ఇబ్బందికరమైన కాల్స్, SMSలను అరికట్టడంలో విఫలమైనందుకు టెలికాం రెగ్యులేటర్ ట్రాయ్ తమకు రూ.కోటి పెనాల్టీని విధించినట్లు వోడాఫోన్ ఐడియా కంపెనీ తెలిపింది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా సెప్టెంబర్ 28న జరిమానా విధించినట్లు వోడాఫోన్ ఐడియా (వీఐఎల్) తాజా రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. టెలికాం కమర్షియల్ కమ్యూనికేషన్స్ కస్టమర్ ప్రిఫరెన్స్ రెగ్యులేషన్స్, 2018 ప్రకారం 2021 డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో ఫిర్యాదుల కోసం కంపెనీ నెట్‌వర్క్ ద్వారా పంపిన అన్‌సొలిసిటెడ్ కమర్షియల్ కమ్యూనికేషన్స్ (UCC)ని అరికట్టడంలో వొడాఫోన్ ఐడియా వైఫల్యం చెందినట్లు ట్రాయ్ పేర్కొంది. ఈ ఆర్డర్‌ని సమీక్షిస్తున్నామని, దీనిపై ఎలా ముందుకెళ్లాలన్న దానిపై పరిశీలిస్తున్నామని వొడాఫోన్ ఐడియా ఫైలింగ్‌లో తెలిపింది.వొడాఫోన్ ఐడియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్-జూన్ (క్యూ1)లో నికర నష్టం మరింత పెరిగి రూ. 7,840 కోట్లను తాకింది. మరోవైపు జూన్ నెలలో 12.8 లక్షల మంది యూజర్లను ఈ టెలికాం కంపెనీ కోల్పోయింది.
Search This Blog
Showing posts with label telecom. Show all posts
Showing posts with label telecom. Show all posts
Saturday, September 30, 2023
Wednesday, August 23, 2023
వొడాఫోన్ ఐడియా (Vi) కొత్త సర్వీసులు !
వొడాఫోన్ ఐడియా (Vi) కొత్త సర్వీసులు అందుబాటులోకి తీసుకువచ్చింది. వొడాఫోన్ ఐడియా తన సబ్‌స్క్రైబర్ల కోసం ఓటీపీ సర్వీసులు అందుబాటులో తెచ్చింది. ప్రిపెయిడ్ సిమ్ వాడే వారు ఒక్క ఓటీపీతోనే పోస్ట్ పెయిడ్‌కు మారిపోవచ్చు. ఇలా మారిపోవడానికి సిమ్ కార్డును మార్చాల్సిన పని లేదు. ఓటీపీ సాయంతో మీరు ప్రిపెయిడ్ నుంచి పోస్ట్ పెయిడ్‌కు సింపుల్‌గా జంప్ కొట్టొచ్చు. అలాగే పోస్ట్ పెయిడ్ నుంచి కూడా ప్రిపెయిడ్‌కు మారిపోవచ్చు. ప్రిపెయిడ్ పోస్ట్ పెయిడ్ మరింత సులభంగా పొందొచ్చు. ప్రిపెయిడ్ నుంచి పోస్ట్ పెయిడ్‌కు మారాలని భావించే కస్టమర్లకు కంపెనీ రెండు రకాల పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ అందుబాటులో ఉంచింది. వీఐ మ్యాక్స్ 401, వీఐ మ్యాక్స్ 501 అనేవి ఇవి. వీఐ కంపెనీ స్టోర్స్ వద్దకు వెళ్లి మరీ ప్రిపెయిడ్ నుంచి పోస్ట్ పెయిడ్‌కు లేదా పోస్ట్ పెయిడ్ నుంచి ప్రిపెయిడ్‌కు మారేందుకు రిక్వెస్ట్ ఇవ్వాలి. తర్వాత మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. దీన్ని ఎంటర్ చేసి పని పూర్తి చేసుకోవచ్చు. సాయంత్రం 6 గంటలకు లోపు ఇచ్చే రిక్వెస్ట్‌లు అన్నీ రాత్రి 10 గంటల కల్లా పూర్తి అవుతాయి. ఇలా మీరు పోస్ట్ పెయిడ్ నుంచి ప్రిపెయిడ్ లేదా ప్రిపెయిడ్ నుంచి పోస్ట్ పెయిడ్‌కు మారేటప్పుడు 30 నిమిషాల పాటు సర్వీసులు అందుబాటులో ఉండవు. అలాగే కేవైసీ వివరాలు మిస్ మ్యాచ్ అయితే అప్పుడు మీ రిక్వెస్ట్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల మీరు ఈ విషయాన్ని చెక్ చేసుకోవాలి. ఒకవేళ కన్వర్ట్ రిజెక్ట్ అయితే అప్పుడు మీరు మళ్లీ ఒకసారి కేవైసీ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మళ్లీ మీరు ప్రిపెయిడ్ నుంచి పోస్ట్ పెయిడ్‌కు లేదంటే పోస్ట్ పెయిడ్ నుంచి ప్రిపెయిడ్‌కు మారిపోవచ్చు.
Tags:
internet,
science,
technology,
telecom,
ప్రిపెయిడ్ సిమ్ వాడే వారు ఒక్క ఓటీపీతోనే పోస్ట్ పెయిడ్‌కు,
వీఐ మ్యాక్స్ 401,
వీఐ మ్యాక్స్ 501,
వొడాఫోన్ ఐడియా (Vi) కొత్త సర్వీసులు
Thursday, May 18, 2023
బీఎస్ఎన్ఎల్ లో రూ. 49 నుంచి ఓటీటీ ప్లాన్స్ !
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ అతి తక్కువ ధరలో కొత్త ఓవర్ ద టాప్ (ఓటీటీ) ప్లాన్లను ప్రవేశపెట్టింది. ప్లస్ పేరుతో వీటిని లాంచ్ చేసింది. వీటిల్లో అన్ని దాదాపు అన్ని ప్రముఖ ఓటీటీలను అందిస్తోంది. బీఎస్ఎన్ఎల్ తన కొత్త ప్లాన్ ప్లస్ ను లయన్స్ గేట్, షీమారూమీ, హంగమా, ఎపిక్ ఆన్ వంటి వాటితో కలసి అధిక ఓటీటీ ఎంటర్టైన్మెంట్ ఆప్షన్లను అందిస్తోంది. బీఎస్ఎన్ఎల్ మూడురకాల ప్యాక్స్ ఆఫర్ చేస్తోంది. ఫైబర్ కనెక్షన్‌తో రిజిస్టర్ అయి ఉన్న మొబైల్ నంబర్ మీద ఈ ఓటీటీ ప్యాక్ అనేది యాక్టివేట్ చేసుకోవచ్చు. ఈ సబ్ స్క్రిప్షన్ నెట్ బిల్లులో ఛార్జ్ చేస్తారు. ఇందులో స్టార్టర్ ప్యాక్, ఫుల్ ప్యాక్, ప్రీమియం ప్యాక్ అని మూడు రకాలు ఉన్నాయి. రూ.49కే బేస్ ప్యాక్ ద్వారా ప్రీమియం ఇండియన్ ఒరిజినల్స్, బ్లాక్ బస్టర్ హాలీవుడ్ లు, టీవీ షోలను కలిగిన లయన్స్ గేట్, హంగామా, షెమారూ, ఎపికాన్ ఓటీటీ యాప్స్ లభిస్తాయి. గతంలో ఈ ప్యాక్ ధర రూ.99గా ఉండేది. బీఎస్ఎన్ఎల్ ప్లస్ ఫుల్ ప్యాక్ కేవలం రూ.199కే అందిస్తోంది. దీని ద్వారా జీ5 ప్రీమియం, సోనీ లివ్ ప్రీమియం, డిస్నీ ప్లస్ హాట్ స్టార్, యప్ టీవీ యాప్స్ వంటివి పొందవచ్చు. ప్లస్ ప్రీమీయం ప్యాక్ ధర రూ.249గా ఉంది. దీని ద్వారా సోనీ లివ్ ప్రీమియం, జీ5 ప్రీమియం, యప్ టీవీ, హంగామా, షెమారూ, లయన్స్ గేట్, హాట్ స్టార్ వంటి ఓటీటీలను పొందవచ్చు. బీఎస్ఎన్ఎల్ ప్లస్ ప్యాక్ ద్వారా 300లకుపైగా లైవ్ టీవీ ఛానల్స్, 500లకు పైగా టీవీ షోలు, 8000పైగా లు చూసే అవకాశం లభిస్తోంది. స్కోప్ వీడియో యాప్ ద్వారా కంప్యూటర్, ల్యాప్‌టాప్, మొబైల్, ఐపాడ్, ట్యాబ్లెట్, స్మార్ట్ టీవీ వంటి వాటిల్లోనూ ఓటీటీ కంటెంట్ చూడవచ్చు. వీటిల్లో సూపర్ స్టార్ ప్రీమియం ప్లస్ ప్లాన్ ఉంది. రూ.999 ప్లాన్‌తో 150 ఎంబీపీఎస్ హైస్పీడ్ ఇంటర్నెట్ ద్వారా 300లకుపైగా లైవ్ టీవీ ఛానల్స్ వీక్షించవచ్చు.
55 వేల మంది ఉద్యోగుల్ని తొలగించనున్న బీటీ గ్రూప్ !
బ్రిటన్కు చెందిన వోడాఫోన్ 11వేల మంది ఉద్యోగుల్ని తొలిగిస్తామని చెప్పిన రెండురోజులకే బీటీ గ్రూప్ లేఆఫ్స్ ప్రకటించడం గమనార్హం. ఖర్చులు తగ్గించే ఉద్దేశ్యంతో బ్రిటన్కు చెందిన ప్రముఖ టెలికాం కంపెనీ బీటీ గ్రూప్ సుమారు 42 శాతం సిబ్బందిని తగ్గించేందుకు సిద్ధమైంది. మొత్తం 55 వేల మంది ఉద్యోగుల్ని తీసివేయనుంది. 2030 వరకు ఈ ప్రక్రియ కొనసాగనున్నట్లు కంపెని ప్రకటించింది. బీటీ సంస్థలో సుమారు లక్షా 30 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. రానున్న అయిదు నుంచి ఏడేళ్లలో తమ ఉద్యోగుల సంఖ్యను 75 వేల నుంచి 90 వేల వరకు కుదించనుంది. ఫైబర్-ఆప్టిక్ బ్రాడ్‌బ్యాండ్ 5 జీ మొబైల్ నెట్‌వర్క్ సేవలు పూర్తిగా అందుబాటులోకి వచ్చిన తర్వాత మెయింటనెన్స్ కోసం ఎక్కువ మంది ఉద్యోగులు అవసరం లేదని కంపెనీ తెలిపింది. ఈ దశాబ్దం చివరికి లీనియర్ బిజినెస్‌తో బ్రైటర్ ఫ్యూచర్‌గా బీటీ గ్రూప్ రూపాంతరం చెందుతుందని, బెస్ట్ అండ్ టాప్, నెక్స్ట్ జనరేషన్ నెట్‌వర్క్‌లకు ఉత్తమమైన కస్టమర్ సర్వీస్, సొల్యూషన్‌లతో కనెక్ట్ అవుతుందని గ్రూప్ సీఈవో ఫిలిప్ జాన్సెన్ చెప్పారు.
Tuesday, November 22, 2022
యూజర్లను కోల్పోతున్న వొడాఫోన్ ఐడియా
వొడాఫోన్ ఐడియా తమ సబ్‌స్క్రైబర్‌లను కోల్పోతోంది. సెప్టెంబర్ నెలలో టెలికాం రెగ్యులేటర్ డేటా ప్రకారం భారతదేశంలో మొత్తం మొబైల్ వినియోగదారుల సంఖ్యలో 30.6 లక్షల మంది తగ్గారు. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్ టెల్ వినియోగదారులు పెరగగా, వొడాఫోన్ ఐడియా సబ్‌స్క్రైబర్ల సంఖ్య క్షీణించింది. జియో సెప్టెంబర్ నెలలో 7.2 లక్షల వైర్‌లెస్ సబ్‌స్క్రైబర్‌లను పెంచుకుంది. మార్కెట్ లో మరోసారి తనకు తిరుగులేదని నిరూపించుకుంది. భారతీ ఎయిర్ టెల్ కూడా తన వినియోగదారుల సంఖ్యను మరో 4.12 లక్షలకు పెంచుకుంది. మొత్తంగా సెప్టెంబర్ నెలలో రిలయన్స్ జియో ఎక్కువ సబ్‌స్క్రైబర్‌లను సంపాదించుకున్నప్పటికీ ఆగస్టు నెలలో 32.81 లక్షల సబ్‌స్క్రైబర్‌ల కన్నా ఇది చాలా తక్కువ. ఇక వొడాఫోన్ ఐడియా యూజర్ల సంఖ్య పడిపోయింది. ఏకంగా 40 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు తగ్గారు. మొత్తం వైర్‌లెస్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య ఈ ఏడాది ఆగస్టు చివరి నాటికి 114.9 కోట్లు ఉంటే సెప్టెంబర్ చివరినాటికి 114.54కు తగ్గిందని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) తెలిపింది. మొత్తం మీద భారతదేశంలో టెలిఫోన్ వినియోగదారుల సంఖ్య ( మొబైల్, బ్రాడ్ బ్యాండ్, టెలిఫోన్) సెప్టెంబర్ 2022 చివరి నాటికి దాదాపుగా 117.19 కోట్లకు తగ్గింది. మొత్తంగా 0.27 శాతం నెలవారీ క్షీణత నమోదు అయింది. ఇక సెప్టెంబర్ 2022 చివరి నాటికి మొత్తం బ్రాడ్ బ్యాండ్ సబ్‌స్క్రైబర్లు 81.6 కోట్లకు పెరిగిందని, నెలవారీ వృద్ధి రేటు 0.28 శాతంగా ఉందని ట్రాయ్ వెల్లడించింది. సెప్టెంబర్ నాటికి ఇండియాలో 41.9 కోట్ల వినియోగదారులతో రిలియన్స్ జియో మొదటిస్థానంలో ఉండగా.. 36.4 కోట్లతో ఎయిర్ టెల్ రెండో స్థానంలో, 24.9 కోట్లతో వొడాఫొన్ మూడోస్థానంలో ఉంది.
Tuesday, July 6, 2021
హద్దు మీరితే రూ.10వేలు,,,,,!
డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికామ్ (డాట్) టెలికామ్ మార్కెటర్స్‌కు కొత్త నిబంధనలు ఇష్యూ చేసింది. 50కు మించి నిబంధనలు అతిక్రమించి మెసేజ్ లేదా కాల్ చేస్తే రూ.10వేలు ఫైన్ కట్టాలని అధికారిక స్టేట్మెంట్ విడుదల చేసింది. 0-10 నిబంధనలు దాటితే రూ.1000 ఫైన్, 10-50 దాటితే రూ.5వేలు ఫైన్, 10-50 దాటితే రూ.10వేలు ఫైన్ కట్టాలి. ప్రస్తుతమున్న టెలికాం కమర్షియల్ కమ్యూనికేషన్స్ కస్టమర్ ప్రిఫెరెన్స్ రెగ్యూలేషన్స్ (టీసీసీసీపీఆర్)2018 ఆధారంగా 0-100, 100-1000అంతకంటే ఎక్కువ నిబంధనలు అనే స్లాబ్స్ మాత్రమే ప్రస్తుతం అమల్లో ఉన్నాయి. డిజిటల్ ఇంటిలిజెన్స్ యూనిట్ (డిఐయూ) డివైజ్ లెవల్ లో చెక్ చేసి నిబంధనలను అమలుపరుస్తోంది. ఒకవేళ రీ-వెరిఫికేషన్ జరగని నెంబర్లు ఉంటే.. డిస్కనెక్ట్ చేయడమే కాకుండా ఆ ఐఎమ్ఈఐ నెంబర్లను అనుమానితుల జాబితాలో చేరుస్తారు. అటువంటి నెంబర్ల నుంచి ఫోన్లు వెళ్లకుండా 30రోజుల పాటు నిషేదం విధిస్తారు. కొత్త కనెక్షన్ నుంచి ఏదైనా కమ్యూనికేషన్ వస్తే ఐఎమ్ఈఐ నెంబర్ రికార్డ్ చేసుకుని గ్రే లిస్ట్ కింద ఫైల్ చేసి రీ వెరిఫికేషన్ కోసం పంపిస్తారు.నిబంధనలు అతిక్రమించడం కొనసాగితే ఆ ఐడెంటిటీ, అడ్రస్ ప్రూఫ్ ను రెండేళ్ల పాటు బ్లాక్ చేసేస్తారని అధికారికంగా వెల్లడించింది.
Subscribe to:
Posts (Atom)
Popular Posts
-
Andhra Pradesh State board of Secondary Education BSEAP, conducted AP SSC/X Class/10th Class Examination 2013 on March/April 2013. An...
-
1. LifeHacker.co.uk LifeHacker aims to help its users out with life in the modern world. Popular tags include ‘Productivity’, ‘Money’ a...
-
Type Indian langauges in windows applications with Anu script manager 7.0 Supported Langauges: - Hindi, Devnagari, Telugu, Tamil, Ka...