Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Showing posts with label tiktalk. Show all posts
Showing posts with label tiktalk. Show all posts

Friday, February 10, 2023

టిక్ టాక్ ఇండియా ఉద్యోగులందరూ తొలగింపు


భారత్ లో టిక్ టాక్ తన కార్యకలాపాలను పూర్తిగా మూసివేసింది. ఇండియా లో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ ఒకేసారి ఇంటికి పంపిస్తున్నట్టు ప్రకటించింది. దీంతో దేశం నుంచి పనిచేస్తున్న 40 మంది ఉద్యోగులు ప్రభావితం కానున్నారు. 2020 కు ముందు భారత్ లో టిక్ టాక్ ఓ వెలుగు వెలిగింది. ఎంటర్ టైన్ మెంట్ కోసం ఈ యాప్ ను అత్యధికంగా ఫాలో అయ్యేవారు. ఇండియా నుంచి టిక్ టాక్ కు 200 మిలియన్ పైగా యూజర్లు ఉన్నారంటేనే దాని క్రేజ్ ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. ఈ యాప్ తో ఓవర్ నైట్ స్టార్స్ అయినా వాళ్లు చాలా మందే ఉన్నారు. అయితే జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా భారత్ లో టిక్ టాక్ ను నిషేధించారు. దీంతో ఇక్కడి నుంచి బ్రెజిల్, దుబాయ్ టిక్ టాక్ మార్కెట్ల కోసం కొంతమంది ఉద్యోగులు పనిచేస్తారు. ఇపుడు వారందరికి ఒకేసారి ఉద్వాసన పలికింది టిక్ టాక్. భారత్ లో నిషేధం అయిన మూడేళ్ల తర్వాత బైట్ డ్యాన్స్ కు చెందిన సోషల్ మీడియా యాప్.. ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగులందరినీ సాగనంపింది. నిషేధం తర్వాత మార్కెట్ వాటా లేకపోయినప్పటికీ.. కార్యాలయాన్ని కొనసాగిస్తోంది టిక్ టాక్. ఇక ఇండియాలో తిరిగి ఎంట్రీ ఇవ్వాలనుకున్న ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇండియా లో పనిచేస్తున్న టిక్ టాక్ ఉద్యోగులకు ఫిబ్రవరి 28 చివరి తేదీగా ఉండనుంది. గత వారమే 40 మంది ఉద్యోగులకు పింక్ స్లిప్ లను అందించింది. లేఆఫ్స్ కు గురైన ఉద్యోగులకు 9 నెలల జీతాన్ని చెల్లిస్తామని సంస్థ పేర్కొంది. గ్లోబల్, ప్రాంతీయ సేల్స్ టీమ్స్ సపోర్ట్ కోసం 2020లో భారత్ సంస్థ సపోర్ట్ హబ్ ను ప్రారంభించింది. అయితే ఈ సపోర్ట్ హబ్ ను ప్రస్తుతం మూసి వేయాలని నిర్ణయించింది.

Saturday, October 2, 2021

అత్యధిక డౌన్ లోడ్స్ కలిగిన యాప్స్ప్రపంచవ్యాప్తంగా అత్యధిక డౌన్ లోడ్స్ ఉన్న యాప్స్ ఏవో తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఎందుకంటే.. ఆ రెండు  యాప్స్ ఇండియాలో బ్యాన్ అయినవే. అవి కేవలం అత్యధిక డౌన్ లోడ్స్ కలిగిన యాప్స్ మాత్రమే కాదు. అత్యధికంగా రెవెన్యూ పొందిన యాప్స్ కూడా అవే. 2021 మూడో క్వార్టర్ లో అత్యధిక డౌన్ లోడ్స్, అత్యధిక సంపాదన కలిగిన యాప్స్ లిస్టును సెన్సార్ టవర్ అనే సంస్థ వెల్లడించింది. అందులో టాప్ లో ఉన్న యాప్స్ టిక్ టాక్, పబ్ జీ. ఈ రెండు యాప్స్ మన దేశంలో బ్యాన్ అయ్యాయి. ఈ రెండు కూడా చైనాకు చెందిన యాప్స్. ప్రతి సంవత్సరం టిక్ టాక్ లో ఒక యూజర్ గడిపే సమయం 41 శాతం పెరుగుతూ వెళ్తోందట. అదే పబ్ జీ గేమ్ లో ఒక యూజర్ ప్రతి సంవత్సరం గడిపే సమయం 11 శాతం పెరుగుతూ వెళ్తోందట. గూగుల్ ప్లే, యాపిల్ స్టోర్.. రెండింట్లో కలిపి.. 2021 మూడో క్వార్టర్ లో టిక్ టాక్, పబ్ జీ రికార్డ్ సృష్టించాయని సెన్సార్ టవర్ వెల్లడించింది. టిక్ టాక్ తర్వాతి స్థానాల్లో ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్, వాట్సప్, ఫేస్ బుక్ మెసెంజర్ ఉన్నట్టు పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా 3 బిలియన్(300 కోట్లు) డౌన్ లోడ్స్ మార్క్ ను టిక్ టాక్ ఇటీవలే క్రాస్ చేసింది. మొబైల్ గేమ్స్ క్యాటగిరీలో పబ్ జీ మొదటి స్థానాన్ని ఆక్రమించింది. దాని తర్వాతి స్థానాల్లో మై టాకింగ్ ఏంజెలా 2, సబ్ వే సర్ఫర్స్, కౌంట్ మాస్టర్స్, బ్యాటిల్ రాయలే గరెనా ఫ్రీ ఫైర్ రౌండెడ్ అప్ యాప్స్ ఉన్నాయి.

Tuesday, August 10, 2021

ఫేస్‌బుక్‌ను దాటేసిన టిక్‌టాక్‌..ప్రపంచంలోనే నెంబర్ వన్ సోషల్ మీడియా సంస్థ అయిన ఫేస్‌బుక్‌ను టిక్‌టాక్ అధిగమించింది. 2020లో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ డౌన్‌లోడ్స్ అయిన యాప్‌గా టిక్‌టాక్ చరిత్ర సృష్టించింది. అప్పటి వరకు టాప్‌లో ఉన్న పేస్‌బుక్‌ను కిందికి నెట్టేసి.. టిక్‌టాక్ మొదటిస్థానంలో నిలిచింది. ఒక బిజినెస్ జర్నల్.. సోషల్ మీడియా యాప్స్ డౌన్‌లోడ్స్ మీద చేపట్టిన గ్లోబల్ సర్వే ఫలితాలను తాజాగా వెల్లడించింది. ఈ సర్వేలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. ఒక్కసారిగా టిక్‌టాక్ గ్లోబల్ మార్కెట్‌లో పుంజుకొని ఫేస్‌బుక్ మార్కెట్‌ను దెబ్బతీసింది. ఇండియాలో గత సంవత్సరం జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య సుమారు చైనాకు చెందిన సుమారు 200 యాప్‌లను భారత ప్రభుత్వం నిషేధించింది. అందులో టిక్‌టాక్ కూడా ఉంది.

Sunday, July 11, 2021

టిక్ టాక్ మోజు ప్రాణం తీసింది !

 


పవన్ నీమ్కార్, ప్రియాంక నీమ్కార్ కు ఆరేళ్ల క్రితం వివాహమైంది.  కొంతకాలం వరకు బాగానే ఉన్నప్పటికీ సోషల్ మీడియాకు ప్రియాంక బాగా అలవాటు పడింది. ఇది రాను రాను మరీ ఎక్కువైంది. రాత్రికి రాత్రే టిక్‌టాక్‌లో వీడియోలు చేస్తూ వచ్చింది. టిక్‌టాక్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ అవుతున్నా కొద్ది ప్రియాంక మొత్తంగా సోషల్ మీడియాకే పరిమితమైపో సాగింది. ఇది గమనించిన భర్త పవన్, ఆమెను పలు మార్లు మందలించాడు. వీరిద్దరూ కొన్నిసార్లు ఘర్షణ కూడా పడ్డారని స్థానికులు చెబుతున్నారు. అయితే ప్రియాంక ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాకపోవడంతో విసుగు చెందిన భర్త పవన్  ఆదివారం ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.పవన్ తల్లి  తన కుమారుడు  మృతికి కోడలే  కారణమని బాలానగర్ డీసీపీ పద్మజకు ఫిర్యాదు చేశారు.

Popular Posts