Ad Code

నేత మగ్గం - పంచ్‌కార్డు - కంప్యూటర్‌ ఇన్‌ఫుట్‌, అవుట్‌ఫుట్‌


నేమగ్గం, పంచ్‌కార్డు, కంప్యూటర్‌ ఇన్‌ఫుట్‌, అవుట్‌ఫుట్‌కు సంబంధం ఏమిటనుకుంటన్నారా? వుందండి అదేమిటో మీరే చూడండి. చేనేత మగ్గాలను మనం గ్రామాలలో చూస్తాము. చేతి ద్వారా నేత నేయడంతో బట్టను తయారు చేస్తారు. యంత్రాల ప్రవేశంతో చేనేత కుంటుబడి నేత కార్మికుల దైన్య స్థితిని చూస్తూనే వున్నాము. సంప్రదాయబద్ధమైన కుల వృత్తిని వీడి అనేక ఇతర వృత్తులలో స్థిరపడ్డారు. వేరే పని చేయడం చేతకాక దానిని నమ్ముకుని బ్రతకలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న నేతన్నలను చూస్తున్నాము.
అయితే జకార్డ్‌ మగ్గాల వలన ఒక మేలు జరిగిందనే చెప్పాలి. దానిలో వినియోగించే పంచ్‌కార్డుల టెక్నాలజీ భవిష్యత్‌ తరాలకు చాలా మేలు చేసింది.
నేత మగ్గాలు
17వ శతాబ్దం మధ్యంలో ఫ్రాన్స్‌కు చెందిన జాక్విస్‌ అనే నేత కార్మికుడు మగ్గానికి దారాలను అందించడానికి దీర్ఘచత్రుసాకారంలో వుండే ఒక కార్డుకి రంధ్రాలు చేసి ఉపయోగించాడు. (మన నేత కార్మికులు డాబీని ఉపయోగించి హాసు ద్వారా డిజైన్‌ నేసినట్లు) దీని ద్వారా బట్టపై డిజైన్లు నేయడం సాధ్యమైంది. ఈ కార్డులో కొన్ని లోపాలు వున్నా వేరే ప్రత్యామ్నాయం లేకపోవడంతో ఆ పద్ధతినే అనుసరించారు. 18వ శతాబ్దం ప్రారంభంలో జాకార్డ్‌ అనే నేత కార్మికుడు జాక్విస్‌ తయారు చేసిన కార్డులోని లోపాలను సరిచేసి వేర్వేరు డిజైన్లలో కార్డులను బట్టల తయారులో ఉపయోగించాడు. శాస్త్రీయ మగ్గాల కన్నా జాకార్డ్‌ తయారుచేసిన మగ్గం మెరుగైన ఫలితాలివ్వడంతో చేనేత రంగంలో ఒక ప్రకంపనం సృష్టించబడింది. జాకార్డ్‌ మగ్గాన్ని ప్యారిస్‌లో ఒక పారిశ్రామిక ప్రదర్శనలో ప్రదర్శించబడింది. జాకార్డ్‌ వినియోగం వలన తమ జీవనోపాధి కోల్పోతామని నేత కార్మికులు ప్రదర్శనలో వున్న జాకార్డ్‌ మగ్గాలన్నీ తగులబెట్టారు. కాలక్రమేణా జాకార్డ్‌ మగ్గాలకు ఆదరణ పెరిగింది. అతని పేరే ఆ మగ్గాలకు స్థిరపడింది.
పంచ్‌కార్డులు

జాకార్డ్‌ మగ్గాలలో వినియోగించిన పంచ్‌కార్డుల ఆధారంగా గవర్నమెంట్‌ సంస్థలు, బ్యాంక్‌లు, న్యాయస్థానాలు, ట్రెజరరీ, రెవిన్యూ మొదలగు వాటిలో పంచ్‌కార్డులను ఉపయోగం గణనీయంగా పెరగడంతో వీటి వ్యాపారం జోరందుకుంది. స్టోరేజ్‌ మాధ్యమాలైన మ్యాగటిక్‌ టేప్‌లు, డిస్క్‌లు అందుబాటులోకి రానంత కాలం పంచ్‌కార్డులను స్టోరేజ్‌లుగా ఉపయోగించేవారు.
పంచ్‌కార్డులు రాకతో డేటా ప్రాసెసింగ్‌ ప్రక్రియలో కొంత పుంతలు తొక్కి వ్యాపార, వాణిజ్యరంగాలల్లో గణనీయమైన అభివృద్ధికి నోచుకున్నా వీటి వినియోగంలో అనేక సమస్యలు తలెత్తాయి. కార్డుల పరిమాణాలలో నిర్దిష్దష్టమైన కొలతలు, ప్రమాణాలు లేకపోవడంతో కంప్యూటర్‌ తయారీదారులు వేర్వేరు ప్రమాణాలతో కార్డులను తయారు చేయడంతో ఒక కంప్యూటర్‌కు తయారు చేసిన కార్డు ఇంకొక కంప్యూటర్‌కు సెట్‌ అయ్యేదికాదు. కార్డులో ఎన్ని కాలమ్స్‌ వుండాలి, ఎన్ని వరుసులుండాలి, ఎక్కడ పంచ్‌ చేస్తే అది దేనిని సూచిస్తుంది అనే విషయాలలో కూడా తారతమ్యాలుండేవి. అలాగే డేటా స్టోరేజ్‌లో నిర్దిష్టమైన ఫార్మేట్‌ వుండేది కాదు. కంప్యూటర్లు వాడుకలోకి వచ్చిన కాలంలో వాటిని అద్దెకు ఇచ్చేవారు. కంప్యూటర్‌తో పాటు ఈ పంచ్‌కార్డులను కూడా విధిగా అద్దెకు తీసుకోవాలనే షరతును పెట్టేవారు. ఇటువంటి ప్రతిబంధాలు వుండటంతో వినియోగదారులు చాలా ఇబ్బందులు పడేవారు. ఆ తరువాత స్టోరేజ్‌ మాధ్యమాలు అందుబాటులోకి రావడంతో వీటికి బ్రేక్‌పడింది.
కంప్యూటర్‌ ఇన్‌ఫుట్‌, అవుట్‌ఫుట్‌
కంప్యూటర్‌ శాస్త్రవేత్త ఛార్లెస్‌ బ్యాబేజ్‌ మగ్గాలలో వాడే పంచ్‌కార్డుల విధానం కంప్యూటర్లలో ఇన్‌ఫుట్‌ - అవుట్‌ఫుట్‌లకు అన్వయించవచ్చునని కార్డులలో వేర్వేరు స్థానాలలో రంధ్రాలను చేయడం ద్వారా వాటి మీద డేటాను స్టోర్‌ చేయవచ్చునని గ్రహించడంతో తాను రూపొందిస్తున్న ఎనలైటికల్‌ ఇంజన్‌ అనే కంప్యూటర్‌లో ఈ విధానాన్ని అనుసరించి విజయం సాధించాడు. బ్యాబేజ్‌ డిజైన్‌ను మెరుగుపర్చి కంప్యూటర్‌ను రూపొందించిన హెర్మన్‌ అనే మరో శాస్త్రవేత్త కూడా ఇన్‌ఫుట్‌ - అవుట్‌ఫుట్‌లకి పంచ్‌కార్డుల సిస్టమ్‌ను వాడి ఆ పద్ధతిని ఇనుమడింపచేశాడు. కంప్యూటర్‌ రంగంలో డేటా ప్రాసెసింగ్‌ అనే ఒక కొత్త ఒరవడికి నాంది పలికారు. సైన్స్‌ అభివృద్ధి చెందుతున్న కొలదీ దానిలో పలు మార్పులు చోటుచేసుకొని మన దైనందిన జీవితంలో ప్రాధాన్యతను సంతరించుకుంది.

Post a Comment

0 Comments

Close Menu