Header Ads Widget

బ్లాగ్‌ ఆవిష్కర్త విలియమ్స్‌ మరో సంచలనం

'ట్విట్టర్‌'


ప్రజలు తమ ఆలోచనలను పంచుకునే వేదికగా (ఫ్లాట్‌ఫాం) సాఫ్ట్‌వేర్‌ను మలచడాన్ని అలవాటుగా మలుచుకున్న ఇవాన్‌ విలియమ్స్‌ మరో సంచలనాన్ని ఆవిష్కరించారు. నాలుగేళ్ల కిందట గూగుల్‌ ప్రారంభించిన ఈజీ-టు-యూజ్‌ బ్లాగింగ్‌ టూల్‌ బ్లాగర్‌ను డెవలప్‌ చేసిన విలియమ్స్‌ 'ట్విట్టర్‌' పేరిట మరో సెల్ఫ్‌-పబ్లిషింగ్‌ సర్వీస్‌, మినీబ్లాగ్‌ సర్వీస్‌ను సృష్టించారు. మార్చి, 2006లో ప్రారంభమైన ఈ సర్వీస్‌కు అమితాదరణ లభిస్తున్నది. ట్విట్టర్‌ ద్వారా కంప్యూటర్స్‌, ఫోన్ల నుండి ప్రపంచంలో ఎవరికైనా షార్ట్‌ మెసేజ్‌లను పంపుకునే వెసులుబాటు ఉంది. దీనిపై తొలుత విమర్శకులు పెదవివిరిచినా విలియమ్స్‌ వినిఊరుకున్నారంతే..ఇంకా తన తాజా సంచలనం ట్విట్టర్‌ గురించి ఆయన ఏమంటున్నారంటే...మనకు అత్యంత ఇష్టమైన వారి బాగోగులు, ఇష్టాలు, ఆనందానుభూతులను పంచుకునే అవకాశం ట్విట్టర్‌ కల్పిస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే దీంతో ఓ వ్యక్తి మరో వ్యక్తి హృదయంలోకి తొంగిచూడవచ్చు. ట్విట్టర్‌ వెబ్‌ ఇంటర్‌ఫేస్‌, టెక్ట్స్‌ మెసేజ్‌ (ఎస్‌ఎంఎస్‌) ద్వారా ఈ ప్రక్రియ జరుగుతుంది. దీంతో రోజంతా షార్ట్‌ లిటిల్‌ టెక్ట్స్‌ అప్‌డేట్స్‌ను పొందవచ్చు. ట్విట్టర్‌ సైట్‌పై లేదా ఇన్‌స్టంట్‌ మెసెంజర్‌ వంటి డెస్క్‌టాప్‌ క్లైంట్స్‌ ద్వారా అప్‌డేట్స్‌ను యాక్సెస్‌ చేసుకోవచ్చు. ఎక్కువమంది ట్విట్టర్‌ను కేవలం వెబ్‌సైట్‌పై వాడుతున్నారు. దీనికన్నా ఎస్‌ఎంఎస్‌ ఇంకా ఆసక్తికరంగా ఉంటుంది. ఎక్కువసమయం బయట ఉండేవారికి ఎస్‌ఎంఎస్‌ మోడ్‌ వినూత్న అనుభూతిని ఇస్తుంది. ఐఎం, ఎస్‌ఎంఎస్‌ తరహాలోనే ట్విట్టర్‌ పోలిఉన్నా అనూహ్య రిప్లైలను పొందే ఎగ్జయింటిగ్‌ అనుభవం ట్విట్టర్‌ సొంతం అంటారు విలియమ్స్‌. విభిన్న షేరింగ్‌ అనుభూతులను ఇది మనకు సొంతం చేస్తుంది. అవతలివ్యక్తి మనసు పొరలను స్పృశించే అవకాశం కల్పిస్తుందనీ ఆయన చెబుతారు. ప్రజలు వారి దైనందిన జీవితంలో ఎదురయ్యే అనుభవాలు అవి ఎంతచిన్నవైనా ఇతరులతో పంచుకునేందుకు ట్విట్టర్‌ చాలా ఉపకరిస్తుంది. మనసును తేలికపరిచి ఉత్తేజపరుస్తుంది. తనకు రోజూ ఎందరినుండో ఇలాంటి సందేశాలు వస్తుంటాయని, అప్పుడే చూసిన సినిమా గురించో, రెస్టారెంట్‌లో ఆతిథ్యం గురించే వారి స్పందనను షార్ట్‌మెసేజ్‌ల్లో తెలియచేస్తుంటారనీ, వీరిలో అపరిచితులూ ఉంటారని విలియమ్స్‌ చెబుతారు. వీరిలో మనకు పరిచితులు ఉంటే అవి మనకు ఆసక్తికరంగా ఉంటాయి. మనకు తెలియని వారైనా అవి వినేందుకు ఫన్నీగా ఉంటాయి. 'ఎంతో మంది నాకు తెలియని వారి నుండి అప్‌డేట్స్‌ పొందుతుంటాను, అలాగే నా అప్‌డేట్స్‌ను చాలా మంది పొందుతారు' అంటారు విలియమ్స్‌. ప్రజల జీవితాల్లో తాజా క్షణాలను పరిశీలించడానికి, వారి ఆలోచనలను పంచుకోవడానికి ట్విట్టర్‌ నూతన తరహా కమ్యూకేషన్‌ టూల్‌ అంటారు విలియమ్స్‌. మీ స్నేహితుడి నుండి మీరు ట్విట్టర్‌ అప్‌డేట్‌ పొందుతున్నప్పుడు ఆ సమయంలో అతను ఏం చేస్తున్నదీ మీరు పిక్చర్‌గా బంధించవచ్చని కూడా విలియమ్స్‌ అంటున్నారు. ప్రస్తుతానికి ట్విట్టర్‌ను పరిమిత సంఖ్యలోనే ప్రజలు ఉపయోగిస్తున్నారనీ, భవిష్యత్‌లో ఇది విస్తృతమవుతుందని చెప్పారు. అయితే ట్విట్టర్‌ పనితీరు అనేక పరిమితులకు లోబండిదనే విమర్శలను ఆయన తోసిపుచ్చుతూ ట్విట్టర్‌ను సింప్లిసిటీని మేళవించి రూపొందించడం వల్ల ఇలాంటి అపోహలు ప్రచారంలో పెడుతున్నారని విలియమ్స్‌ చెబుతారు. ముందుముందు దీని సింప్లిసిటీని కొనసాగిస్తూనే మరిన్ని ఫీచర్లను జోడించాలని భావిస్తున్నాం. సింప్లిసిటీలోనే ట్విట్టర్‌ ప్రయోజనం ఇనుమడిస్తుందనేది మా ప్రగాఢ విశ్వాసం అని విలియమ్స్‌ వ్యాఖ్యానించారు. కేవలం సింపుల్‌ అప్‌డేట్స్‌ పరికరంగానే ట్విట్టర్‌ కనిపించినా ఇది మల్టీడివైజ్‌ నెట్‌వర్క్‌ అంటారు విలియమ్స్‌. ఇందులో తాజా సమాచారం, ఎమర్జెన్సీ మెసేజ్‌లనూ పోస్ట్‌ చేయవచ్చని దానికి వేర్వేరు విభాగాలున్నాయి. ఎమర్జెన్సీ బ్రాడ్‌కాస్ట్‌ సిస్టమ్‌ను సంప్రదించడం ద్వారా ముందస్తు ప్రమాద సూచనలను, తాజా పరిస్ధితిని సంబంధిత వ్యక్తులు వెల్లడించే అవకాశం ఉంది. సబ్‌స్క్రిప్షన్‌పై ప్రజలకు అందుబాటులో ఉన్న ట్విట్టర్‌ సేవలను త్వరలో విస్తృతం చేస్తామని విలియమ్స్‌ చెబుతున్నారు. తమ నెట్‌వర్క్‌ను పెంచుకోవడంతో పాటు ట్విట్టర్‌ యాక్టివ్‌ యూజర్లను కూడా పెంచుకోవాలని యోచిస్తున్నామని, చిన్న చిన్న పీపుల్స్‌ గ్రూప్‌లకు చేరువైతే విస్తరణ సులభంగా ఉంటుందని, గ్రూప్‌ల మధ్య ట్విట్టర్‌ వినియోగం కూడా ఆనందానుభూతి కలిగిస్తుందని విలియమ్స్‌ అంటారు.
 

Post a Comment

0 Comments