Ad Code

గ్రూప్ వీడియో కాల్స్ !

 


గ్రూప్ వీడియో కాల్స్ ఆప్షన్​ను టెలిగ్రామ్ తీసుకొచ్చింది. ఆన్​లైన్ క్లాసులకు, వ్యాపార సమావేశాలకు, మీటింగ్​లకు ఇది ఎంతో ఉపయోగపడనుంది. కొత్తగా యానిమేటెడ్​ ఎమోజీలు, థర్డ్​పార్టీ స్టిక్కర్లను ఇంపోర్ట్ చేసుకునే సదుపాయం కూడా వచ్చింది. అలాగే స్క్రీన్ షేరింగ్​, నాయిస్ సస్పెన్షన్​, యానిమేటెడ్ బ్యాంక్​గ్రౌండ్​ లాంటి సూపర్ ఫీచర్లను టెలిగ్రామ్ ప్రవేశపెట్టింది. ఏదైనా గ్రూప్​లో యాక్టివ్​ సెషన్​లో ఉన్నప్పుడు 'షేర్ మై వీడియో' అనే ఆప్షన్​ను క్లిక్ చేయడం ద్వారా టెలిగ్రామ్​లో గ్రూప్​ వీడియోకాల్స్ చేయవచ్చు. ప్రస్తుతానికి వాయిస్ చాట్​లో యాడ్ అయిన మొదటి 30 మంది వీడియో కాల్​లో యాడ్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ పరిమితిని త్వరలోనే పెంచుతామని టెలిగ్రామ్ ప్రకటించింది. అలాగే గేమ్స్ స్ట్రీమింగ్​, లైవ్ ఈవెంట్స్​తో పాటు మరిన్ని సదుపాయలు తీసుకొస్తామని చెప్పింది. దీంతో వాట్సాప్​కు గట్టిపోటీగా నిలవచ్చని టెలిగ్రామ్ భావిస్తోంది.

Post a Comment

0 Comments

Close Menu