Ad Code

పసిడి మెరిసింది !


అంతర్జాతీయంగా డిమాండ్‌ పెరిగిన నేపథ్యంలో భారత్‌లో బంగారం  ధర పెరిగింది. గురువారం నాటి బులియన్‌ ట్రేడింగ్‌లో దేశ రాజధాని దిల్లీలో రూ.10గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.526 పెరిగి రూ.46,310కి చేరింది. రూపాయి బలహీనపడటం కూడా బంగారం ధర పెరుగుదలకు కారణమైందని బులియన్‌ ట్రేడింగ్‌ వర్గాలు తెలిపాయి. బుధవారం 10గ్రాముల బంగారం రూ. రూ.45,784 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. వెండి కూడా బంగారం బాటలోనే పయనించింది. ఇటీవల భారీగా తగ్గిన వెండి గురువారం రూ.1,231 పెరిగి, కిలో రూ.68,654కు చేరింది. అంతకుముందు కిలో రూ.67,423గా ఉన్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయంగా బంగారం ధర ఔన్సు 1,778 డాలర్లుగా ఉండగా, వెండి ఔన్సు 26.25 డాలర్లుగా ఉంది. హైదరాబాద్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.48,760 వద్ద ట్రేడ్‌ అవుతోంది.

Post a Comment

0 Comments

Close Menu