Ad Code

మనీ ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు ?


ప్రస్తుతం ఆర్థిక లావాదేవీలు అన్నీ ఆన్‌లైన్ లోనే జరుగుతున్నాయి. గూగుల్ పే, ఫోన్ పే వచ్చినప్పటి నుంచి చాలా మంది బ్యాంకులకు వెళ్లడమే మానేశారు. ఏ చిన్న పనికైనా ఆన్ లైన్ డిజిటల్ ప్లాట్ ఫాంలోనే చేస్తున్నారు. ప్రస్తుతం చాలా మంది ఈజీగా మనీ ట్రాన్స్ ఫర్ చేసుకోవడానికి ఎక్కువగా గూగుల్ పే వాడుతున్నారు. మొదట్లో స్క్రాచ్ కార్డుల ద్వారా గూగుల్ పే చాలా మందిని ఆకర్షించింది. దాంతో అందరూ గూగుల్ పేలో మనీ ట్రాన్స్ ఫర్ చేయడానికే ఆసక్తి చూపుతున్నారు. అయితే కొంత మంది ఒక రోజులో ఏడు లేదా ఎనిమది సార్లు మనీ ట్రాన్స్ ఫర్ చేశాక, మళ్లీ మనీ ట్రాన్స్ ఫర్ చేస్తే ఎర్రర్ వస్తుంది. అది అర్థం కాక చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. అయితే ప్రతి డిజిటల్ ప్లాట్ ఫాంలో ఒక్కోదానికి యూపీఐ మోడ్ పేమెంట్ సొంత పరిమితులు అనేవి ఉంటాయి. అంటే,  రోజుకు ఎంతవరకు డబ్బులు ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు అనే లిమిట్ ఉంటుంది. అలాగే గూగుల్ పేకు కూడా రోజుకు లేదా నెలలో ఎంతవరకు గరిష్టంగా మనీ ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చో అనే లిమిట్ ఉన్నది. గూగుల్ పేలో ఒక రోజులో పది సార్ల కంటే ఎక్కువ సార్లు మనీ ట్రాన్స్ ఫర్ చేయాలన్న లేదా ఒక రోజులో లక్షకు పైగా మనీ ట్రాన్స్ ఫర్ చేయాలన్నా మనం మరసటి రోజు కోసం ఎదురు చూడాల్సిందే. ఎందుకంటే డెయిలీ మనీ ట్రాన్స్ ఫర్ లిమిట్ దాటితే గూగుల్ పే నుంచి అమౌంట్ ట్రాన్స్ ఫర్ కాదు, అంతే కాకుండా ఎవరి నుంచైనా రూ.2వేల కంటే ఎక్కువ అమౌంట్ రిక్వెస్ట్ చేసినా మనీ ట్రాన్స్ ఫర్ కాదు. కానీ, మనం చిన్న మొత్తంలో అమౌంట్ పంపేందుకు రిక్వెస్ట్ పంపవచ్చు.

Post a Comment

0 Comments

Close Menu