Header Ads Widget

సుమన్‌కు దాదా సాహేబ్‌ ఫాల్కే అవార్డు


నటుడు సుమన్‌ను దాదా సాహెబ్‌ ఫాల్కే పురస్కారం వరించింది. ముంబయిలో ఆదివారం జరిగిన పురస్కార ప్రదానోత్సవంలో దక్షిణాది నుంచి సుమన్‌ ఈ పురస్కారం అందుకున్నారు. దాదా సాహెబ్ మనవడు చంద్రశేఖర్ అవార్డు ప్రదానం చేశారు. పురస్కారం అందుకోవడం పట్ల సుమన్ ఆనందం వ్యక్తం చేశారు. నటుడిగా తన ఎదుగుదలకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా సుమన్‌ కృతజ్ఞతలు చెప్పారు. ఇటీవల సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ను దాదాసాహెబ్‌ అవార్డు వరించిన విషయం తెలిసిందే. 

Post a Comment

0 Comments