Ad Code

సహకార శాఖ ఏర్పాటు అభ్యంతరకరం



కేంద్రంలో కొత్తగా సహకార శాఖ ఏర్పాటు చేయడంపై సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సహకార శాఖ అనేది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న ప్రాథమిక నిర్మాణమని, ఇదే తమ అభ్యంతరమన్నారు. రాజ్యాంగంలోని ఏడో షెడ్యూల్‌లో కోఆపరేటివ్ సొసైటీ రాష్ట్ర జాబితాలో పేర్కొన్నారని, అలాంటిది ఈ శాఖను కేంద్రం ఎందుకు తన చేతుల్లోకి తీసుకుంటోందని, అలాంటి పనులకు ఎందుకు ఒడిగడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాంకులను మోదీ ప్రభుత్వం దోచుకుందని, దేశం విడిచిపోయే వారికి పెద్ద మొత్తంలో మోదీ సర్కార్ లోన్లను మంజూరు చేసిందని విమర్శించారు. ఇప్పుడు సహకార బ్యాంకులను దోచుకోడానికి సర్కార్ సిద్ధమైందని ఏచూరీ విమర్శించారు. 

Post a Comment

0 Comments

Close Menu