Ad Code

రాబోయే కాలం రోబోలదే ..?


ఒకప్పటి లాగా లేదు ప్రస్తుత ప్రపంచం. యాంత్రీకరణ బాగా పెరిగింది. ప్రజెంట్ టెక్నాలజీ వరల్డ్‌లో ప్రతీది మెషిన్స్ ఆధారంగా దాదాపుగా జరిగే పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ క్రమంలోనే భవిష్యత్తులో మరిన్ని మార్పులు సంభవించే చాన్సెస్ ఉంటాయి. ఆటోమేషన్ కీ రోల్ ప్లే చేయొచ్చు. రోబోటిక్స్, డిజిటల్‌ప్లాట్ ఫామ్స్ సరికొత్తగా వస్తాయి. ఈ నేపథ్యంలోనే ఉద్యోగాల సృష్టి ఆయా రంగాల్లోనే ఉండొచ్చు. ప్రస్తుతమున్న పరిస్థితులకు భిన్నంగా ఉంటాయని ఓ అధ్యయనంలో తేలింది. ఈ క్రమంలోనే విద్యార్థులు తమకు ఏం కావాలో నిర్ణయించుకుని ఆ మేరకు ప్లాన్ చేసుకుంటే బాగుంటుందని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి. అందుకు దగ్గట్లుగా నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలని సూచిస్తున్నాయి. ఉదాహరణకు.. డాక్టర్ కావాలని ప్రస్తుతం లక్ష్యంగా పెట్టుకున్న ఫ్యూచర్‌లో వచ్చే మార్పులను గెస్ చేయగలగాలి. అప్పటికి డాక్టర్స్‌కు సహాయకులుగా మనుషులకు బదులుగా రోబోలు రావొచ్చు. ఇకపోతే నర్సుల స్థానంలో మెషీన్లు పని చేయొచ్చు.అందుకే ప్రతీ ఒక్కరు అప్పటి పరిస్థితులకు అనుగుణంగా డే టు డే అప్‌డేట్ అయ్యేందుకుగాను ప్రయత్నిస్తూ ఉండాలి. అలా చేస్తే వృత్తిలో అడుగుపెట్టాక ఎటువంటి సమస్యలు తలెత్తవు. మనుషులను రోబోలు, మెషీన్లు రిప్లేస్ చేసే చాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఉద్యోగాలు పోతాయని భయపడాల్సిన అవసరం లేదని, కొత్త ఉద్యోగాల కోసం నైపుణ్యాలను పెంపొందించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. విదేశాల్లో ఇప్పటికే పలు రంగాల్లో గణనీయమైన మార్పులొచ్చాయి. కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో ఇండస్ట్రియల్ రివొల్యూషన్ లేదా డిజటల్ రివొల్యూషన్ ఆల్రెడీ వచ్చేసింది. అక్కడ రోబోలు, మెషిన్లు, టెక్నాలజీ వినియోగం బాగా పెరిగింది. ఏఐ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) ఆధారంగా సంస్థలు కొన్ని పని చేస్తున్నాయి. 3 డీ ప్రింటింగ్, రోబోట్స్, సెల్ఫ్ డ్రైవింగ్ వంటి టెక్నొలాజికల్ ఇన్వెన్షన్స్‌ను మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలోనే మన దేశంతో పాటు ప్రపంచంలో ఇంకా సరి కొత్త మార్పులు వచ్చే చాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఉద్యోగార్థులు అవేర్‌నెస్ ఏర్పరుచుకుని కావలిసిన నైపుణ్యాలను పెంచుకోవాలి. సాంకేతికతను అర్థం చేసుకుని ముందుకు సాగుతు ఉండాలి. మొత్తం అన్ని రంగాల్లో రోబోలు వచ్చే చాన్సెస్ ఉంటాయి. కాబట్టి రోబోటిక్స్‌పైన అవగాహన పెంచుకోవాలి.

Post a Comment

0 Comments

Close Menu