Ad Code

నంబర్ గుర్తుండిపోతుందిలా !

 


బ్యాంకుల్లో కస్టమర్ల డేటా స్టోరేజీ పాలసీపై మార్గదర్శకాలను ఆర్బీఐ సవరించింది. ఈ విషయమై పేమెంట్ గేట్‌వే కంపెనీలు చేసిన ప్రతిపాదనను తిరస్కరించింది. తాజాగా సవరించిన గైడ్‌లైన్స్ ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, నెట్‌ఫ్లిక్స్ వంటి పేమెంట్ సంస్థలకు చేయూతనిస్తాయి. ఈ సంస్థల సర్వర్లు లేదా డేటా బేసెస్‌లో కస్టమర్ల వ్యక్తిగత సమాచారం నిల్వ చేశాయి. కొత్త మార్గదర్శకాల ప్రకారం డెబిట్ కార్డులు లేదా క్రెడిట్ కార్డులతో లావాదేవీలు జరిపిన ప్రతిసారీ కస్టమర్లు తమ డెబిట్ లేదా క్రెడిట్ కార్డులోని 16 డిజిటల్ నంబర్లు చెప్పాల్సి ఉంటుంది. స్టోరింగ్ డేటా లేని పేమెంట్స్ ఆపరేటర్ల వద్ద సర్వీసు అందుకుంటున్న కస్టమర్ల డేటా భద్రత కోసమే ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకున్నది. ఈ నిబంధనలతో కూడిన మార్గదర్శకాలు వచ్చే ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి అమలులోకి రానున్నాయి. ఖాతాదారులు వచ్చే జనవరి నుంచి లావాదేవీలు జరిపిన ప్రతిసారి మీ డెబిట్ కార్డ్ నంబర్లు, పాస్‌వర్డ్‌. సీవీవీ నంబర్ చెప్పాల్సి ఉంటుంది. ఈ మేరకు ఇప్పటివరకు ఉన్న ప్రతి డెబిట్ లేదా క్రెడిట్ కార్డుపై కొత్త కార్డులు జారీ అవుతాయి. ఆర్బీఐ తీసుకున్న నిర్ణయానికి ఆన్‌లైన్ పేమెంట్స్ సంస్థ యూపీఐ ఆమోదం తెలిపింది.

Post a Comment

0 Comments

Close Menu