Ad Code

ఓలా ఎలక్ట్రిక్ కారు వచ్చేస్తోంది...!

 


ఎలక్ట్రిక్ వాహనాలకు ఫుల్ డిమాండ్ ఏర్పడుతోంది. పలు కంపెనీలు వాహనాల తయారీలో బిజీ బిజీగా ఉన్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు మార్కెట్ లో బైక్స్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో విడుదల చేసిన కంపెనీలకు ధీటుగా మరికొన్ని కొత్త కొత్త ఫీచర్లతో వాహనాలు తయారు చేస్తున్నట్లు.. వాటికి సంబంధించిన వివరాలు వెల్లడిస్తున్నాయి. బైక్స్ కోసం యమ బుకింగ్స్ చేసేస్తున్నారు. వాహనాలు మార్కెట్ లో రిలీజ్ చేసిన కంపెనీల్లో 'ఓలా' ఒకటి. ఎలక్ట్రిక్ బైక్స్ కాకుండా..కార్లను కూడా రిలీజ్ చేయాలని ఆ కంపెనీ భావిస్తోందని తెలుస్తోంది. ఓలా కో ఫౌండర్ భవీష్ అగర్వాల్ ఎలక్ట్రిక్ కార్లకు సంబంధించి ట్విట్టర్ ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఓలా కార్లను మార్కెట్ లో లాంచ్ అయ్యే సంవత్సరాన్ని వెల్లడించడం విశేషం. రెండు నెలల క్రితం వరకు తనకు కారు లేదని, హైబ్రిడ్ కారు ఉందని భవీష్ అగర్వాల్ వెల్లడించారు. తర్వాత 2023 ఎలక్ట్రిక్ కారు..అది కూడా ఓలా ఎలక్ట్రిక్ కారు..అని రిప్లై ఇచ్చారు. దీంతో ఓళా కంపెనీ నుంచి ఎలక్ట్రిక్ కారు వస్తుందని తేలిపోయింది. భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా…ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఎస్ 1 ను ఘనంగా లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం ఫ్రీ బుకింగ్ చేసుకోవచ్చని తెలపడంతో ప్రజల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. 24 గంటల్లో లక్షకు పైగా ఆర్డర్స్ వచ్చాయి.

Post a Comment

0 Comments

Close Menu