Ad Code

నోకియా C20 ప్లస్ వచ్చేసింది!

 

రిలయన్స్ జియో మరియు హెచ్‌ఎండి గ్లోబల్ సంస్థ నోకియా రెండు భాగస్వామ్యం అయిన తరువాత నేడు భారతదేశంలో కొత్తగా నాలుగు స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేశాయి. ఈరోజు వర్చువల్ బ్రీఫింగ్‌లో నోకియా C01 ప్లస్, నోకియా C30, నోకియా G10 మరియు నోకియా C20 ప్లస్‌ వంటి నాలుగు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. నోకియా కంపెనీ భారతదేశంలో తన మొదటి 5G ఫోన్ నోకియా XR20 అని తెలిపింది.  సరసమైన ధరలో డ్యూయల్ రియర్ కెమెరా మరియు ఆక్టా-కోర్ SoC మరియు ఒక ఛార్జ్‌పై రెండు రోజుల బ్యాటరీ లైఫ్ వంటి ఫీచర్లతో లభిస్తుంది.  భారతదేశంలో నోకియా C20 ప్లస్ ఫోన్ రెండు వేరియంట్‌లలో విడుదలైంది. ఇందులో 2GB RAM + 32GB స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ.8,999 కాగా 3GB ర్యామ్ + 32GB స్టోరేజ్ ఆప్షన్‌ యొక్క ధర రూ.9,999. ఇది నోకియా ఇండియా వెబ్‌సైట్, ప్రముఖ మొబైల్ రిటైలర్లు, రిలయన్స్ డిజిటల్ మరియు జియో పాయింట్ అవుట్‌లెట్‌ల ద్వారా నేటి నుంచి అంటే ఆగస్టు 9 సోమవారం నుండి దేశంలో బ్లూ మరియు గ్రే కలర్ ఎంపికలలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. దీనిని కొనుగోలు చేయడానికి లాంచ్ ఆఫర్‌లలో భాగంగా 10 శాతం డిస్కౌంట్‌తో పాటు ప్రత్యేకంగా రూ.4,000 విలువైన రిలయన్స్ జియో వోచర్లు కూడా లభిస్తుంది. నోకియా C20 ప్లస్ స్మార్ట్ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 11 (గో ఎడిషన్) పై రన్ అవుతుంది. ఇది 6.5-అంగుళాల HD+ డిస్‌ప్లేను 720x1,600 పిక్సెల్స్ మరియు 20: 9 యాస్పెక్ట్ రేషియోతో ఉంటుంది. ఫోన్ ఆక్టా-కోర్ యునిసోక్ SC9863a SoC తో శక్తిని పొందుతూ 3GB వరకు RAM తో జతచేయబడి వస్తుంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే ఇది వెనుక భాగంలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ఇందులో 8 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ మరియు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌తో పాటు ఎల్‌ఈడీ ఫ్లాష్ ఉంటుంది. సెల్ఫీలు మరియు వీడియో చాట్‌ల కోసం ముందు భాగంలో 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.

Post a Comment

0 Comments

Close Menu