Ad Code

2024 నాటికి ఫ్లయింగ్‌ కార్లు


కార్లలో విపరీతమైన క్రేజీ డిజైన్లు, రంగులు అందుబాటులో ఉండగా.. ఇప్పుడు ఎలక్ట్రిక్‌ కార్లు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. రానున్న రోజుల్లో డ్రైవర్‌లెస్‌ కార్లు, ఫ్లయింగ్‌ కార్లదే హవా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. డ్రైవర్‌లెస్‌ కార్ల తయారీపై పలు ప్రముఖ కంపెనీలు ఇప్పటికే పరిశోధనలు జరిపి మార్కెట్లోకి తీసుకొచ్చే స్థాయికి చేరుకున్నాయి. కాగా, రానున్న రెండేండ్లలో ఎగిరే కార్లను అందుబాటులోకి తెస్తానని చైనాకు చెందిన ఓ స్టార్టప్‌ కంపెనీ వెల్లడించింది. చైనాలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఎక్స్‌పెంగ్ ఇంక్ మద్దతుతో ఫ్లయింగ్‌ కార్ల స్టార్టప్ సంస్థ అయిన ఎక్స్‌పెంగ్ హైటెక్.. 2024 నాటికల్లా ఎగిరే కార్లను వినియోగదారులకు అందిస్తామని తెలిపింది. 2013 లో స్థాపించి జీపెంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ హీ జియోపెంగ్‌ ద్వారా నిధులు సమకూర్చుకున్న ఈ స్టార్టప్.. ఇప్పుడు 400 మంది ఉద్యోగులను నియమించుకున్నది. ఈ ఏడాది చివరికల్లా 700 మందితో వర్క్‌ఫోర్స్‌ను విస్తరించున్నట్లు కంపెనీ వ్యవస్థాపకుడు జావో డెలి తెలిపారు. చైనాలో ఎగిరే కార్లను అభివృద్ధి చేస్తున్న ఇతర వాహన తయారీ కంపెనీల్లో గీలీస్ టెర్రాఫుజియా ఉన్నది. ఇది వుహాన్‌లో ఫ్యాక్టరీని నిర్మిస్తున్నది. వోక్స్‌వ్యాగన్ ఏజీ కూడా చైనాలో పరిశ్రమ ఏర్పాటుపై అధ్యయనం చేస్తున్నట్లు తెలుస్తున్నది. అయితే, చైనాలో ఎగిరే వాహనాలకు సంబంధించిన నియమాలను ప్రభుత్వం ఇంకా రూపొందించలేదు.

Post a Comment

0 Comments

Close Menu