ఎంఐ టీవీ 5ఎక్స్ సిరీస్ సేల్ షురూ !

  

షియోమీ  గతేడాది లాంచ్ అయిన ఎంఐ టీవీ 4ఎక్స్‌కు తర్వాతి వెర్షన్‌గా ఈ టీవీ సిరీస్ లాంచ్ అయింది. ఇందులో 40W స్పీకర్లు, డాల్బీ అట్మాస్ సపోర్ట్‌ను అందించారు. ఇందులో మూడు సైజ్ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 43 అంగుళాల వేరియంట్ ధర రూ.31,999 కాగా, 50 అంగుళాల వేరియంట్ ధర రూ.41,999గా నిర్ణయించారు.

హైఎండ్ మోడల్ అయిన 55 అంగుళాల వేరియంట్ ధర రూ.47,999గా ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డులతో దీన్ని కొనుగోలు చేస్తే రూ.3,000 తగ్గింపు లభించనుంది. ఎంఐ.కాం, ఫ్లిప్‌కార్ట్, ఎంఐ హోం, ఎంఐ స్టూడియో, క్రోమా స్టోర్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. 43, 50, 55 అంగుళాల సైజుల్లో ఈ టీవీ లాంచ్ అయింది.

డాల్బీ విజన్, హైబ్రిడ్ లాగ్ గామా, హెచ్‌డీఆర్10, హెచ్‌డీఆర్10+ ఫీచర్లను కూడా ఇందులో అందించారు. 43 అంగుళాల వేరియంట్లో 30W స్పీకర్లను అందించగా, మిగతా వేరియంట్లలో 40W స్పీకర్లను అందించారు. ఇందులో వివిడ్ పిక్చర్ ఇంజిన్ 2 ఫీచర్‌ను అందించారు. ఫొటో ఎలక్ట్రిక్ సెన్సార్‌ను కూడా ఇందులో షియోమీ అందించింది.

ఈ ఫీచర్ ద్వారా పరిసరాలకు తగ్గట్లు స్క్రీన్ బ్రైట్‌నెస్ మారుతుంది. దీని స్క్రీన్ టు బాడీ రేషియో 96.6 శాతంగా ఉంది. ప్రీమియం మెటాలిక్ బెజెల్స్, 4కే రిజల్యూషన్ కూడా ఇందులో ఉన్నాయి. గూగుల్ అసిస్టెంట్ సేవల కోసం ఫార్ ఫీల్డ్ మైక్‌లను అందించారు.

మూడు హెచ్‌డీఎంఐ 2.1 పోర్టులు, రెండు యూఎస్‌బీ పోర్టులు కూడా ఇందులో అందించారు. 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్ ఇందులో అందించారు. 64 బిట్ క్వాడ్‌కోర్ ఏ55 సీపీయూని ఇందులో అందించారు. ఆండ్రాయిడ్ టీవీ 10 ఆపరేటింగ్ సిస్టంపై ఈ టీవీ పనిచేయనుంది.

ఇందులో కిడ్స్ మోడ్‌ను అందించారు. ప్లేస్టోర్ యాక్సెస్, క్రోమ్‌కాస్ట్ బిల్ట్-ఇన్ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. ఇందులో 75కు పైగా లైవ్ చానెల్స్‌ను ఉచితంగా చూడవచ్చు. ఓటీటీ యాప్స్‌లో కంటెంట్‌ను సెర్చ్ చేయవచ్చు.

Post a Comment

0 Comments