Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Thursday, September 23, 2021

పలాస దర్శకుడి తదుపరి చిత్రం 'బ్రాకెట్' ?

 

'పలాస' సినిమా టాలీవుడ్ లో మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో విమర్శకుల ప్రశంసల్ని సైతం అందుకున్నాడు దర్శకుడు కరుణ కుమార్. దీని తర్వాత కరుణ దర్శకత్వంలో రూపొందిన సుధీర్ బాబు చిత్రం 'శ్రీదేవి సోడా సెంటర్' నిరాశ పరిచినప్పటికీ.. గీతా ఆర్ట్స్ వారు కరుణ కుమార్ ను పిలిచి ఓ ఆఫర్ ఇచ్చారు. మలయాళంలో సూపర్ హిట్టైన 'నాయాట్టు' సినిమా రీమేక్ రైట్స్ ను గీతా ఆర్ట్స్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ సినిమానే ఇప్పుడు కరుణ కుమార్ దర్శకత్వంలో సెట్స్ మీదకు తీసుకెళ్ళేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఈ సినిమా తెలుగు వెర్షన్ కి కరుణ 'బ్రాకెట్' అనే టైటిల్ ను ఖాయం చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. గతంలో బ్రాకెట్ అనే ఒక ఆట ఉండేది. జూదం తరహాలో ఉండే ఈ ఆటను ఎప్పుడో బ్యాన్ చేశారు. 'నాయాట్టు' సినిమా కథాంశం కూడా బ్రాకెట్ ఆట తరహాలో సాగుతుందని ఆ టైటిల్ అనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఓటు బ్యాంక్ రాజకీయాలవల్ల ముగ్గురు పోలీసు ఉద్యోగస్తుల్ని .. పోలీస్ వ్యవస్థే వేటాడే పరిస్థితులు తలెత్తుతాయి. ఆ క్రమంలో ఆ ఉద్యోగస్తులు పడే ఆందోళన, ఆవేదన ఈ సినిమాకి ప్రధానాంశం. మలయాళంలో కుంచాకో బోబన్ , జోజు జార్జ్, నిమిషా సజయన్ ప్రధాన పాత్రల్లో నటించిన 'నాయాట్టు' సినిమా తెలుగు వెర్షన్ లో ఆ పాత్రల్ని ఎవరు పోషిస్తారు అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. అతి త్వరలోనే సినిమా సెట్స్ మీదకు వెళ్ళబోతోంది. మరి నిజంగానే ఈ సినిమాకి 'బ్రాకెట్' అనే టైటిల్ ఫిక్స్ చేస్తారో లేదో చూడాలి. 

No comments:

Post a Comment

Popular Posts