Ad Code

ఆదానీ చేతికి ఎన్డీటీవీ గ్రూప్‌?


ప్రముఖ మీడియా సంస్థ ఎన్డీ టీవీని ఆదానీ గ్రూప్ టేకోవర్ చేయనున్నదని వార్తలొస్తున్నాయి. దీనిపై మీడియాలో వార్తలు రావడంతో సోమవారం బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ)లో ఎన్డీటీవీ షేర్ 10 శాతం పెరిగి అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. బీఎస్ఈలో మధ్యాహ్నం 1.07 గంటలకు 9.94 శాతం పెరిగి రూ.79.65 లకు చేరుకున్నది. ఎన్డీటీవీలో వాటాల కొనుగోలుకు ఆదానీ గ్రూప్ ప్రాధాన్యం ఇస్తున్నట్లు ధృవీకృతం కాని వార్తలను బట్టి తెలుస్తున్నది. ఇంతకుముందే మీడియాలోకి ఎంటర్ కావాలని యోచిస్తున్నట్లు ఆదానీ గ్రూప్ ప్రకటించింది. ఒక పాత టీవీ చానెల్‌ను ఆదానీ గ్రూప్ కొనుగోలు చేయనున్నది. లండన్‌లో రూ.1600 కోట్ల విలువైన ఒప్పందంపై సంతకాలు చేయనున్నారు. ఇప్పటికైతే రూ.100 కోట్లు చెల్లించడంతోపాటు కొన్ని కేసుల నుంచి బయట పడాలని యోచిస్తున్నది. సదరు టీవీ చానెల్‌లో ప్రధాన వాటా రూ.750 కోట్లు అని జర్నలిస్ట్ జే గోపీకృష్ణన్ ట్వీట్ చేశారు. మీడియా సంస్థల్లో పెట్టుబడులు పెట్టడానికి ఆదానీ గ్రూప్ ఆసక్తి చూపుతున్నది. ఇందుకోసం ఆదానీ గ్రూప్‌ వెటరన్ జర్నలిస్టు సంజయ్ పుగాలియాను సీఈవో, ఎడిటర్ ఇన్ చీఫ్‌గా నియమించుకున్నది. ఇక ఎన్డీటీవీ ఆర్థిక లావాదేవీలు ఒడిదొడుకులకు గురవుతున్నాయి. ఎన్టీటీవీ గ్రూప్ చానెల్స్ టీఆర్పీ రేటింగ్ చాలా తక్కువగా ఉంది. ఎన్డీటీవీ ప్రమోటర్లు పన్ను ఎగవేత కేసులను ఎదుర్కొంటున్నారు. ఎన్డీటీవీ గ్రూప్ ఆర్థిక అవకతవకలకు పాల్పడిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఐసీఐసీఐ బ్యాంకు నుంచి రూ.375 కోట్ల మేరకు తీసుకున్న రుణంలో బ్యాంకుకు రూ.46 కోట్ల నష్టం వాటిల్లిందన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై సీబీఐ కేసు దర్యాప్తు చేస్తున్నది

Post a Comment

0 Comments

Close Menu