Ad Code

రూ.38 లక్షల బిల్లు : సోషల్ మీడియాలో వైరల్

 

గత శుక్రవారం రాత్రి నస్ర్-ఎట్ రెస్టారెంట్‌కు వెళ్లారు నలుగురు వ్యక్తులు. ఈ రెస్టారెంట్‌ను సాల్ట్ బే అనే ఓ ప్రముఖ టర్కీష్ చెఫ్ ఇటీవల లండన్‌లో ఏర్పాటు చేశాడు. అయితే నలుగురు కస్టమర్లు ఈ రెస్టారెంట్లో పదుల సంఖ్యలో ఆహార పదార్థాలు ఆర్డర్ చేశారు. అందులో బంగారపు పూతతో తయారుచేసిన ఓ తోమాహాక్‌ ఆర్డర్ చేశారు. దాని ధర 850 పౌండ్లు. ఈ ఐటమ్ తో పాటు వారు 600 పౌండ్ల ఖరీదైన 20 బక్లావాలను ఆర్డర్ చేశారు. అలాగే 9100 పౌండ్ల విలువైన 1996 పెట్రస్ బాటిల్‌ను ఆర్డర్ చేశారు. తరువాత రెండు పెట్రస్ వింటేజ్ బాటిల్స్ కూడా తీసుకున్నారు. ఒక్కో బాటిల్ ధర 9950 పౌండ్లు. అలాగే మరో రెండు ఖరీదైన పానీయాలు ఆర్డర్ చేశారు. అయితే ఆర్డర్ ఇచ్చే ముందు ఈ ధరలు సరి చూసుకున్నారో లేదో తెలియదు కానీ.. బిల్లు వచ్చాక మాత్రం వారు షాక్ అయ్యారట. తోమాహాక్ స్టీక్ 630 పౌండ్లు, బంగారు బర్గర్ 100 పౌండ్లు, కేఫ్‌లు 200 పౌండ్లు కలిపి మొత్తం 1,812 (రూ. 1.83 లక్షలు) పౌండ్లు బిల్ కావడంతో వారు అవాక్కయ్యారట. ఓ కోకాకోలా లైట్ ధర 18, స్వీట్ కార్న్ 12 పౌండ్లు. మొత్తంగా 32,194 పౌండ్లు ఫుడ్ ఐటమ్స్ కి ఛార్జ్ చేయగా.. దానికి అదనంగా 4,829 పౌండ్లు సర్వీస్ ఛార్జ్ వేశారు.  ఈ ధరలు చూసి నెటిజన్లు విస్తుపోతున్నారు. సంవత్సరం పాటు కష్టపడినా ఈ బిల్లు కట్టేంత డబ్బు సంపాదించలేమంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఈ రెస్టారెంట్ ను నుస్రేట్ గోకీ అనే ఓ ప్రపంచ ప్రఖ్యాత చెఫ్ రన్ చేస్తున్నారు. టర్కీకి చెందిన ఇతడు తన రెస్టారెంట్లలో రకరకాల ఐటమ్స్ చాలా స్టైలిష్ గా తయారు చేస్తాడు. అంతేకాదు లక్షల్లో బిల్లులు వసూలు చేయడంలో కూడా అతడు ముందుంటాడు. ప్రపంచవ్యాప్తంగా స్టీక్ రెస్టారెంట్లను నడుపుతున్నాడు. ఈ వంట మనిషికి సోషల్ మీడియాలోనూ బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఏదేమైనప్పటికీ, అతని రెస్టారెంట్ వేసిన బిల్లు చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు.

Post a Comment

0 Comments

Close Menu