Ad Code

మార్కెట్‌లోకి రానున్న ఐకూ 8 లెజెండ్


ఐకూ  వివో సంస్థ నుంచి విడిపోయిన తర్వాత స్వతంత్రంగా స్మార్ట్‌ఫోన్లు విడుదల చేస్తోంది. ఈ కంపెనీ అత్యంత శక్తివంతమైన చిప్‌సెట్‌లతో ఫోన్లను తయారు చేస్తూ మొబైల్ గేమింగ్ ప్రియులను బాగా ఆకట్టుకుంది. ఐకూ 8 లెజెండ్ మోడల్ ఫోన్‌ ఇండియాలో ఈ నెలాఖరులో లేదా నవంబర్ మొదటి వారంలో లాంచ్ కానుందని సమాచారం. ఇప్పటికే చైనాలో విడుదలైన ఐకూ 8 ప్రోని రీబ్రాండ్ చేసి భారతదేశంలో ఐకూ 8 లెజెండ్‌గా లాంచ్ చేయనున్నారని తెలుస్తోంది. ఐకూ కంపెనీ ఇప్పటి వరకు ఐకూ 8 లెజెండ్ పేరుతో ఏ ఫోన్‌ను ఆవిష్కరించలేదు. దీన్నిబట్టి గతంలో ఐకూ 7 ప్రోని ఐకూ 7 లెజెండ్‌గా ఎలా రీబ్రాండ్ చేసి ఇండియాలో రిలీజ్ చేశారో.. అచ్చం అదే తరహాలో ఐకూ 8 ప్రోని ఐకూ 8 లెజెండ్‌గా రీబ్రాండ్ చేసి విడుదల చేయనున్నారని తెలుస్తుంది. 

Post a Comment

0 Comments

Close Menu