Header Ads Widget

అమెజాన్ లో మళ్ళీ నెలవారీ చందా


అమెజాన్ ప్రైమ్ యూజర్లకు మరో కొత్త ఆప్షన్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎక్కువ మంది వినియోగదారులను ఆకర్షించే అమెజాన్‌ ప్రైమ్ వినియోగదారుల సౌకర్యార్ధం మరో ఆప్షన్ అందిస్తోంది. ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ నెలవారి సబ్‌స్క్రిప్షన్‌ సేవలను తిరిగి అమెజాన్‌ ప్రారంభించింది. దీంతో కొత్తగా ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ సేవలను ప్రయత్నించే వారికి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఆర్థికంగా సౌకర్యంగా కూడా ఉంటుంది. ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ సేవలను నెల రోజుల పాటు పొంది, నచ్చకపోతే ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ వెంటనే రద్దు చేసుకోవచ్చు. ఇది వినియోగదారులకు సౌకర్యంగా ఉంటుందని అమెజాన్ పేర్కొంటుంది.

* అమెజాన్ ప్రైమ్‌వార్షిక ప్రణాళిక ధర రూ. 999,

* మూడు నెలల ప్లాన్ ధర తగ్గింపు రేటు రూ. 329 కి బదులుగా రూ. 387. మార్చారు.

* నెలవారీ చందా. రూ. 129లకే అభిస్తోంది. కానీ ఇది ఎంపిక చేసిన డెబిట్‌, క్రెడిట్ కార్డులకు మాత్రమే. 



Post a Comment

0 Comments