మారుతీ కార్లపై భారీ డిస్కౌంట్లు

 

మారుతీ పాపులర్ మోడల్స్ అన్నింటిపై భారీ డిస్కౌంట్లు, పండుగ ఆఫర్లు ప్రకటించింది. ఆల్టో, ఎస్‌-ప్రెసో, వేగన్ఆర్‌, స్విఫ్ట్‌, డిజైర్‌, బ్రెజా మోడల్స్‌పై అక్టోబర్ నెలలో ఈ డిస్కౌంట్లు లభించనున్నాయి. ఆల్టో కారు Std, Lxi, Vxi, Vxi+ వేరియంట్లలో వస్తోంది. ఇందులో ఆల్టో Std వేరియంట్‌పై రూ.38 వేల వరకూ డిస్కౌంట్ ఉండగా.. మిగతా వేరియంట్లపై రూ.43 వేల వరకూ ఇస్తోంది. ఇక ఆల్టో సీఎన్జీ వేరియంట్‌పైనా రూ.18 వేల ఆఫర్లు ఉన్నాయి. మారుతీ సుజుకీ ఎస్‌-ప్రెసోపై ఈ అక్టోబర్ నెలలో రూ.48 వేల వరకూ డిస్కౌంట్లు, ఇతర ఆఫర్లు ఉన్నాయి. సీఎన్జీ వేరియంట్‌పై రూ.18 వేల వరకూ ఇస్తున్నారు. అటు వేగన్ఆర్ మోడల్‌పై రూ.17,500 వరకూ ఈ నెలలో ఆదా చేసుకోవచ్చు. అదే సీఎన్జీ వేరియంట్‌పై రూ.12500 వరకూ డిస్కౌంట్ ఉంది. ఇక ఇండియాలో అతి ఎక్కువగా అమ్ముడైన కార్లలో ఒకటైన మారుతీ సుజుకీ స్విఫ్ట్‌పై ఈ పండుగ పూట రూ.24500 వరకూ డిస్కౌంట్లు ప్రకటించింది ఆ సంస్థ. అదే డిజైర్‌పై రూ.19500, విటారా బ్రెజాపై రూ.17500 వరకూ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.

Post a Comment

0 Comments