Header Ads Widget

నెట్టింట రష్మికకు 23.3 మిలియన్ ల ఫాలోవర్స్

 

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్‌గా రాణించడం ఇప్పుడు అంత ఈజీకాదు. కొత్త కథానాయికల తాకిడి ఇప్పుడు అన్ని ఇండస్ట్రీలో పెరిగిపోయింది. ఈ క్రమంలో హీరోయిన్‌గా నెట్టుకురావడం కష్టమే. కానీ ఈ అమ్మడు మాత్రం అటు టాలెంట్‌తోపాటు ఇటు కాస్త లక్‌తో అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ రేస్‌లో నిలబడింది. ఆ బ్యూటీ ఎవరో కాదు అందాల భామ రష్మిక మందన్న. ఛలో సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ కన్నడ భామ తెలుగులో తక్కువ కాలంలోనే క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది. అంతే కాదు వరుసగా బడా హీరోలతో సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతుంది. తెలుగు సినిమా ల్లో మాత్రమే కాకుండా తమిళం మరియు హిందీ సినిమాల్లో కూడా నటిస్తోంది. పెద్ద ఎత్తున ఈ అమ్మడి సినిమాలు బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ సక్సెస్ లు గా నిలుస్తున్నాయి. ఈ అమ్మడు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. వ్యక్తిగత విషయాలతోపాటు తన సినిమాలకు సంబందించిన అప్డేట్స్ అభిమానులతో పంచుకుంటూ సందడి చేస్తుంది. దాంతో ఈ బ్యూటీకి నెట్టింట ఫాలోవర్స్ కూడా భారీగానే పెరిగిపోయారు. ఇన్ స్టా గ్రామ్ లో ఈ అమ్మడికి 23.3 మిలియన్ ల ఫాలోవర్స్ ఉన్నారు. రష్మిక కేవలం 394 ఇన్ స్టా పోస్ట్ లతో 23 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ను సొంతం చేసుకుంది. ఇప్పటివరకు స్టార్ హీరోయిన్స్ గా కంటిన్యూ అవుతున్న ఏ హీరోయిన్ కూడా ఈ స్థాయిలో ఫాలోవర్స్ ను సొంతం చేసుకోలేదు. ఈ క్రెడిట్ దక్కించుకున్న ఏకైక భామ రష్మిక మందన్నానే కావడం విశేషం.

Post a Comment

0 Comments