Ad Code

చలి కాలం - వేడినీళ్ల స్నానం


చలికి వణికి పోతున్నాం.. వేడి నీటితో స్నానం చేస్తే ఆహా ఎంత హాయిగా ఉంటుంది అని బాత్రూమ్ లో ఎక్కువ సేపు ఉంటూ వేడి నీళ్లతో స్నానం చేస్తుంటారు. అలా చేయడం అంత మంచిది కాదని చెబుతున్నారు చర్మ సంరక్షణ నిపుణులు. ప్రతిరోజూ ఉదయం, సాయిత్రం రెండుసార్లు స్నానం చేయడం అలవాటు చాలా మందికి.  బయటకు వెళ్లి వచ్చిన తరువాత స్నానం చేసి నిద్రకు ఉపక్రమిస్తే నిద్ర కూడా బాగా పడుతుంది. అయితే బాగా వేడిగా ఉన్న నీళ్లతో స్నానం చేయడం వలన చర్మం పొడిబారుతుంది. సహజ నూనెలు ఉత్పత్తి చేయడాన్ని కోల్పోతుంది చర్మం. ఎక్కువ సేపు స్నానం చేయడం వల్ల చర్మం పొడిబారడం, దురద, తామర వంటి చర్మ సమస్యలు ఏర్పడతాయి. గోరు వెచ్చని నీళ్లతో స్నానం చేయడం మంచిది, చాలా సేపు స్నానం చేయడం, షవర్ బాత్ బావుంటుంది కానీ ఎక్కువ సేపు చేయడం చర్మానికి హానికరం. ఎక్కువసేపు స్నానం చేయడం వల్ల చర్మం తేమను కోల్పోతుంది అని డెర్మటాలజిస్టులు తెలియజేస్తున్నారు. పొడి చర్మ సమస్యలు 5 నుండి 10 నిమిషాల్లో స్నానం పూర్తి చేయాలి, పొడి చర్మం ఉన్న వారు స్నానానికి సబ్బుకి బదులు లిక్విడ్ సోప్ ఉపయోగకరం, యాంటీ బాక్టీరియల్ సబ్బులు, షాంపూలు చర్మం డ్యామేజ్ అవకుండా చూస్తాయి, ముఖ్యంగా చలికాలంలో ప్రతిరోజూ తలస్నానం చేయవలసిన అవసరం లేదు.. జుట్టు పొడిగా ఉంటుంది. హార్వర్డ్ మెడికల్ స్కూల్ సమాచారం ప్రకారం, వారానికి రెండు సార్లు తలకి గోరు వెచ్చని నూనెతో మర్దనా చేసుకొని 20 నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో తల స్నానం చేయడం వల్ల వెంట్రుకలు ఆరోగ్యంగా ఉంటాయని తెలిపింది. వ్యాయామం చేస్తున్న వారు రోజుకు రెండుసార్లు తలస్నానం చేయాలని భావిస్తే, ఒక సారి సాధారణ స్నానం మరొకసారి పూర్తి స్నానం చేయాలని సూచించింది.

Post a Comment

0 Comments

Close Menu