Ad Code

పిచ్చితనమా... దేశద్రోహమా !


భారత్‌కు అసలైన స్వాతంత్య్రం 2014లో (ప్రధాని మోడీ అధికారంలోకి వచ్చిన సమయం) వచ్చిందంటూ బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.1947లో వచ్చిన స్వాతంత్య్రం భిక్షమని, దీన్నిస్వేచ్ఛగా పరిగణిస్తామా అంటూ ఓ చానెల్‌ నిర్వహించిన కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. బ్రిటీష్‌ ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్‌ పాలనపై కూడా బురద జల్లేలా ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.  ఈ వ్యాఖ్యలపై బిజెపి ఎంపి వరుణ్‌ గాంధీ తీవ్రంగా స్పందించారు. కంగన వ్యాఖ్యలతో కూడిన వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేసిన ఆయన ఇలాంటి ఆలోచనను పిచ్చితనంగా భావించాలా లేదా దేశద్రోహం గానా అంటూ మండిపడ్డారు. ' కొన్ని సార్లు మహాత్మాగాంధీ త్యాగాలను అవమానం జరుగుతుంది. మరికొన్ని సార్లు జాతిపితను చంపిన హంతకుడికి గౌరవం లభిస్తుంది.  ఇప్పుడు మంగళ్‌ పాండే మొదలు రాణి లక్ష్మిభాయి, భగత్‌ సింగ్‌, చంద్ర శేఖర్‌ ఆజాద్‌, నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌.. ఇలా లక్షలాది స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాల పట్ల తిరస్కార ధోరణి. ఈ ఆలోచనను పిచ్చితనంగా పిలవాలా లేదా దేశద్రోహంగానా? అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. గతంలోనూ నాధూరాం గాడ్సేను పొగిడిన వారిపై వరుణ్‌ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి విదితమే

Post a Comment

0 Comments

Close Menu