Ad Code

లార్డ్ మెకాలే


ఇంగ్లాండ్ పార్లమెంటులో వర్ణ వివక్షకు వ్యతిరేకంగా గొంతు విప్పిన మహానీయుడు ఆయన. ఆయన్ని మనకు ఒక విలన్ గానే పరిచయం చేశారు. భారత దేశపు పారంపర్య విద్యా విధానాన్ని ధ్వంసం చేసి, తెల్లవాళ్ల కింద  'ప్యూన్' ఉద్యోగం చేయడానికి ఇంగ్లీషు నేర్పించిన నీచుడుగానే మొదట్లో పరిచయం చేయబడ్డాడు ఆయన. కానీ, తర్వాత నేనే ఆలోచించాను ! నా అవ్వా, ముత్తవ్వ విద్యావంతులవడం ఎట్లా సాధ్యం అయింది ? అని.. ఎందుకంటే, అడవాళ్లు (శూద్ర స్త్రీ పురుషులు కూడా) చదవకూడదు. గురుకుల విద్య కేవలం బ్రాహ్మణ మగ పిల్లలకు మాత్రమే" అని శాసించబడిన ఆ కాలంలో ఈ మహిళలు మాత్రం ఎట్లా విద్యను పొందగలిగినారు ? నా కుటుంబం అనే చిన్న చట్రాన్ని వదలి బయటి ప్రపంచాన్ని కూడ నేను గమనిస్తున్నాను. మోతీలాల్ నెహ్రూ ఎక్కడ చదివినాడు ? బెంగాలీలు ఎందుకు ఎక్కువగా నోబెల్ బహుమతులు‌ సంపాయిస్తున్నారు ? భారత దేశపు మొదటి సెక్యూలర్ బడి/కళాశాల ఎవరు ప్రారంభించారు ?  విద్య నిరాకరించ బడిన 'రెట్టమలై' కొడుకు, శ్రీనివాసన్ డిగ్రీ ఎలా తీసుకున్నాడు ? ఇలాంటి ప్రశ్నలకు జవాబు లార్డ్ థామస్ బబింగ్టన్ మెకాలే అని తెలుసుకున్నాను. ఇంగ్లాండ్ పార్లమెంటులో వర్ణ వివక్షకు వ్యతిరేకంగా గొంతు విప్పిన మొట్ట మొదటి వాడు ఆయన. ఇండియా వచ్చిన తర్వాత, అదే సెక్యులర్ భావాలను ఇక్కడ కూడా ప్రచారంలో పెట్టినవాడుకూడా ఆయనే

అప్పటి దాకా భారతదేశంలో చదువు అంటే‌...

1. వేద పాఠశాల (హిందువులకు అంటే కేవలం బ్రాహ్మణ మగపిల్లలకు)

2. ఇస్లామిక్ మదరసా (ముస్లిం పిల్లలకు)

3. క్రైస్తవ మిషనరీల కాన్వెంట్ (క్రైస్తవ పిల్లలకు)

పై మూడూ కూడా, కేవలం మతాలకు సంబందించిన విషయాలను మాత్రమే భోదించేవి. భారతదేశంలో విద్య కోసం బ్రిటిష్ ప్రభుత్వం ఖర్చు పెడుతున్న డబ్బులు సామాన్య జనానికి అందడం లేదనీ మత మూఢ నమ్మకాలను పెంచటానికి ఉపయోగ పడుతున్నాయని చెప్పి మొట్టమొదటిసారి "ఇంగ్లీషు, గణితం, సైన్స్, సామాజిక శాస్త్రం, మాతృభాష", అనే ఈ ఐదు పాఠ్యాంశాలతో... సాధారణ సెక్యులర్ విద్యా విధానాన్ని అమలు చేసినవాడు లార్డ్ మెకాలే. దీని తర్వాత ఆయన చేపట్టిన  ప్రాజెక్ట్ ఇంకా గొప్పది. అప్పటిదాకా ముస్లింలకు షరియా చట్టం, హిందువులకు మనుస్మృతి అని ఉండేవి. వాటి స్థానంలో అందరికీ వర్తించే విదంగా "భారత శిక్షాస్మృతి "ని అమల్లోకి తెచ్చింది కుడా ఈ లార్డ్ మెకాలేనే. లార్డ్‌ మెకాలే పెళ్లి చేసుకోలేదు. ఆయనకు జెనెటిక్ వారసులు లేరు. మనమంతా ఆయన మెమెటిక్ వారసులం. మనకు విద్యను, చట్టాలను ఇచ్చిన జ్ఞాన ప్రదాత ఆయన. ఆయనను మగ సరస్వతిగా మనం చెప్పుకోవచ్చు. మహా గొప్ప మనిషి మన మెకాలే.  ఆ మహానీయుడికి మనమందరం, కృతజ్ఞతలు నిండిన  హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పాలి.

- -శాలిని (డాక్టర్ శాలిని చెన్నైలో ప్రముఖ సైకియాట్రిస్ట్)


Post a Comment

0 Comments

Close Menu