Header Ads Widget

జూనియర్ ఎన్టీఆర్ చేతికి గాయం


తన ఇద్దరు కుమారులతో కలిసి ఆయన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలో ఎన్టీఆర్ చేతికి కట్టుకట్టి కనిపిస్తోంది. ఆయన జిమ్ చేస్తుండగా చిన్న గాయమైందని, వైద్యులు మైనర్ సర్జరీ చేశారని సమాచారం. ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ మూవీ వచ్చే సంక్రాంతికి విడుదలవుతోంది. మరో వైపు ఎవరు మీలో కోటీశ్వరుడు అంటూ బుల్లితెర పైనా ఆయన సందడి చేస్తున్నారు. బిగ్ స్క్రీన్ కోసం, స్మాల్ స్క్రీన్ కోసం వర్క్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. మరో వైపు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివతో ఓ భారీ చిత్రం చేయడానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ దశలో ఉంది. ఈ భారీ చిత్రాన్నివచ్చే నెలలో సెట్స్ పైకి తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇలాంటి టైమ్ లో ఎన్టీఆర్ చేతికి గాయమైందని.. డాక్టర్లు మైనర్ సర్జరీ చేశారని తెలిసింది. ఇంతకీ మేటర్ ఏంటంటే.. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి పండుగను ఆనందంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తన పిల్లలతో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Post a Comment

0 Comments