Ad Code

బెస్ట్, వరెస్ట్ టెక్ కంపెనీలు


టెక్ కంపెనీలపై 2021 సంవత్సరానికి గాను యాహూ ఫైనాన్స్ ఒక సర్వే చేసింది. 2021లో బెస్ట్ కంపెనీ ఏది.. వరస్ట్ కంపెనీ అనే దానిపై సర్వే చేసింది. ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా ఈసంవత్సరానికి గాను అత్యంత చెత్త కంపెనీగా ఎంపికైనట్టు యాహూ ఫైనాన్స్ వెల్లడించింది. డిసెంబర్ 4, 5 న యాహూ ఫైనాన్స్ నిర్వహించిన సర్వేలో 1541 మంది పార్టిసిపేట్ చేశారు. అందులో ఫేస్‌బుక్‌కు 8 శాతం మంది మాత్రమే ఓటు వేశారు. దానితో పాటు ఎలక్ట్రిక్ ట్రక్ స్టార్టప్ నికోలాను కూడా వరస్ట్ కంపెనీ కింద జత కట్టారు. ఫేస్‌బుక్ ఈ సంవత్సరం చాలా కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. ఇంటర్నల్ పేపర్స్ లీక్ అవడం, కంపెనీపై పలు ఆరోపణలు రావడం, మెటాకు చెందిన వాట్సప్ కొత్త ప్రైవసీ పాలసీ విధానంలోనూ వివాదాలు చెలరేగడంతో ఫేస్‌బుక్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేరు మాత్రం చెడిపోయింది. అయినప్పటికీ ఫేస్‌బుక్ అవన్నీ తట్టుకొని ఇప్పటికీ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లో నెంబర్ వన్‌గా నిలిచింది. కంపెనీ పేరు మార్చింది. సరికొత్త ప్రాజెక్ట్ మెటావర్స్‌ను ప్రకటించింది. బెస్ట్ కంపెనీ ఆఫ్ ది ఇయర్ 2021గా మైక్రోసాఫ్ట్‌ ఎంపికైనట్టు యాహూ ఫైనాన్స్ పేర్కొంది. సత్య నాదెళ్ల మార్గదర్శకత్వంలో మైక్రోసాఫ్ట్ ఈసంవత్సరం ట్రిలియన్ మార్క్‌ను చేరుకున్న విషయం తెలిసిందే. అలాగే.. విండోస్ ఓఎస్‌లోనూ పలు కీలక అప్‌డేట్స్‌ను మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చింది.

Post a Comment

0 Comments

Close Menu