Ad Code

తొలి ట్యాబ్లెట్‌ను లాంఛ్ చేయనున్న వన్‌ప్లస్‌

 

టీవీలు, ఆడియో ఉత్పత్తులు, వేరబుల్స్‌లో ఎంట్రీ ఇచ్చిన స్మార్‌ఫోన్ తయారీ కంపెనీ వన్‌ప్లస్ భారత్‌లో వచ్చే ఏడాది ఆరంభంలో తొలి ట్యాబ్లెట్‌ను లాంఛ్ చేయనుంది. 2022 మార్చ్‌లో వన్‌ప్లస్ ప్యాడ్ ట్యాబ్లెట్‌ను లాంఛ్ చేస్తుందని భావిస్తున్నారు. వన్‌ప్లస్ ఆఫర్ చేస్తున్న ఈ ట్యాబ్లెట్ ఫీచర్లపై లీకులు వెల్లడయ్యాయి. ఈ లేటెస్ట్ వన్‌ప్లస్ ప్యాడ్ 1752 x 2800 పిక్సెల్ రిజల్యూషన్‌తో 12.4 ఇంచ్ అమోల్డ్ డిస్‌ప్లేతో కస్టమర్లను ఆకట్టుకోనుంది. మరోవైపు లాస్‌వెగాస్‌లో జరిగే 2022 సీఈఎస్ ఈవెంట్‌కు హాజరు కానున్నట్టు వన్‌ప్లస్ ధ్రువీకరించింది. ఇదే ఈవెంట్‌లో న్యూ వన్‌ప్లస్ 10, వన్‌ప్లస్ 10 ప్రొలను ఆవిష్కరించడం లేదా టీజర్‌ను లాంఛ్ చేసే అవకాశం ఉందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. వన్‌ప్లస్ 10 ప్రొను తొలుత చైనాలో లాంఛ్ చేసి ఆపై మార్చ్ లేదా ఏప్రిల్‌లో భారత్ సహా గ్లోబల్ మార్కెట్లలో ప్రవేశపెడతారని చెబుతున్నారు. వన్‌ప్లస్ 10, వన్‌ప్లస్ 10 ప్రొ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 1 చిప్‌సెట్‌తో 125డబ్ల్యూ ఫాస్ట్‌చార్జింగ్ సపోర్ట్‌తో కస్టమర్ల ముందుకు రానున్నాయని అంచనా వేస్తున్నారు.


Post a Comment

0 Comments

Close Menu