Header Ads Widget

ఒప్పో తొలి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్


స్మార్ట్‌ఫోన్ మేకర్ ఒప్పో తొలి ఫోల్డబుల్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ఒప్పో ఫైండ్ ఎన్‌ను లాంఛ్ చేసింది. ట్రిపుల్ కెమెరా సెటప్‌తో, ఇన్నర్‌, ఔటర్ డిస్‌ప్లేలపై సెల్ఫీ కెమెరాలతో ఫైండ్ ఎన్‌ను కస్టమర్ల ముందుకు తీసుకువచ్చింది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 888 చిప్‌సెట్‌, 12జీబీ ర్యాంతో ఈ స్మార్ట్‌ఫోన్ 7.1 ఇంచ్ ఇన్నర్ డిస్‌ప్లే, 5.49 ఔటర్ డిస్‌ప్లేను కలిగిఉంది. డివైజ్‌ను రొటేట్ చేయకుండానే యూజర్లు వీడియోలు చూడటం, గేమ్స్ ఆడటం, బుక్స్‌ను చదవడం వంటి యాక్టివిటీస్ చేపట్టే వెసులుబాటు ఉంది. 33డబ్ల్యూ సూపర్‌వూక్ ఫ్లాష్ చార్జ్‌తో 4500ఏంఏహెచ్ బ్యాటరీ బ్యాకప్‌ను కలిగిఉంది. ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను కస్టమర్ల ముందుకు తీసుకువచ్చేందుకు ఒప్పో సమయంతో పాటు నైపుణ్యాలను వెచ్చించిందని యూజర్ల అవసరాలకు అనుగుణమంగా నూతన డివైజ్‌ను సృష్టించిందని ఒప్పో చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ పీట్ లౌ పేర్కొన్నారు. 

Post a Comment

0 Comments