Ad Code

టొయోటా నుంచి టూ-సీటర్ ఎలక్ట్రిక్ కార్


లక్ష రూపాయలకే  టాటా నానో రిలీజ్ అయి సంచలనం సృష్టించింది. ఇప్పుడు అంతకన్నా చిన్న కారును టొయోటా పరిచయం చేసింది. టొయోటా సీ+పాడ్ మోడల్‌ను జపాన్‌లో రిలీజ్ అయింది.  ఇద్దరు మాత్రమే ఈ కారులో ప్రయాణించొచ్చు. టొయోటా సీ+పాడ్ కార్‌ను 2020 డిసెంబర్‌లోనే జపాన్‌లోని మునిసిపల్ కస్టమర్ల కోసం పరిచయం చేసింది. ఇప్పుడు జపాన్‌లోని సాధారణ ప్రజలకు కూడా ఈ కారును మార్కెట్లోకి రిలీజ్ చేసింది. ఈ కారులో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించొచ్చు. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 150 కిలోమీటర్ల దూరం ప్రయాణించొచ్చు. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తుండటంతో జపాన్ ప్రజల కోసం టొయోటా రిలీజ్ చేసిన టూ-సీటర్ సీ+పాడ్ కార్ ఆకట్టుకుంటోంది.  ఈ కారు బ్యాటరీతో నడుస్తుంది. టాటా నానో కారుతో పోలిస్తే టొయోటా సీ+పాడ్ కార్ చిన్నగా ఉంటుంది. టాటా నానో కారులో నలుగురు కూర్చోవచ్చు. కానీ టొయోటా సీ+పాడ్ కార్‌లో డ్రైవర్‌తో పాటు మరొకరు మాత్రమే కూర్చోవచ్చు. టొయోటా సీ+పాడ్ చిన్న కారే అయినా ఇద్దరూ కంఫర్ట్‌గా కూర్చోవడానికి కావాల్సినంత స్పేస్ ఉంటుంది.  టొయోటా సీ+పాడ్ కారులో 9.06 kWh లిథియమ్ అయాన్ బ్యాటరీ ఉంది. ఫుల్లుగా రీఛార్జ్ చేసి 150 కిలోమీటర్లు తిరగొచ్చు. ను 200V/16A ఔట్‌లెట్ రీఛార్జ్ చేయడానికి ఐదు గంటలు సమయం పడుతుంది. సిటీలో తిరగాలనుకునే వారికి ఈ కార్ ఉపయోగపడుతుంది. ఈ కారులో ఎల్ఈడీ హెడ్ లైట్స్, ఎల్ఈడీ టెయిల్ లైట్స్ ఉంటాయి. ఈ కారు బరువు తగ్గించేందుకు ఎక్స్‌టీరియర్ ప్యానెల్స్‌ని ప్లాస్టిక్‌తో తయారు చేసింది కంపెనీ. టొయోటా సీ+పాడ్ కార్ అనేక కలర్స్‌లో లభిస్తుంది. రెండు గ్రేడ్లలో ఉంటుంది. టొయోటా సీ+పాడ్ 2,490 మిల్లీ మీటర్ల పొడవు, 1,290 మిల్లీ మీటర్ల వెడల్పు, 1,550 మిల్లీ మీటర్ల ఎత్తు ఉంటుంది. జీ గ్రేడ్ వాహనం బరువు 690 కిలోలు. ఎక్స్ గ్రేడ్ వాహనం బరువు 670 కిలోలు.

Post a Comment

0 Comments

Close Menu