Header Ads Widget

జనవరి 18న రియల్‌మి 9ఐ విడుదల


ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ మేకర్ రియల్‌మి ఫ్లాగ్ షిప్ ఫోన్లను భారత మార్కెట్లోకి తీసుకొస్తోంది. జనవరి 18న Realme 9i స్మార్ట్ ఫోన్ లాంచ్ కానుంది. స్నాప్ డ్రాగన్ 680 సామర్థ్యంతో రానున్న Realme 9i ఫ్లాగ్‌షిప్ ఫోన్ ఈ వారం వియత్నాంలో లాంచ్ అయింది. GSM Arena ప్రకారం.. ఈ కొత్త రియల్ మి ఫ్లాగ్ షిప్ ఫోన్ స్ర్కీన్ 6.6 LCDతో FullHD ప్లస్ రెజుల్యుషన్, 90Hz రిఫ్రెష్ రేటుతో వస్తోంది. ఈ ఫోన్లో హైలెట్ ఫీచర్ ఏంటంటే.. 5,000mAh భారీ బ్యాటరీ సామర్థ్యంతో వస్తోంది. 33W చార్జింగ్ సపోర్టు అందిస్తుంది. కెమెరాల విషయానికి వస్తే.. 50MP మెయిన్ కెమెరా యూజర్లను ఆకట్టుకునేలా ఉంది. Realme 9i స్మార్ట్ ఫోన్ రెండు స్టోరేజీ ఆప్షన్లతో వస్తోంది. 4GB/64GB, 6GB RAM, 128GB స్టోరేజీతో రానుంది. ఈ రెండు స్టోరేజీ వెర్షన్లు భారత మార్కెట్లోకి తీసుకొస్తోందో లేదో రియల్‌మి కంపెనీ ఇంకా వెల్లడించలేదు. భారత మార్కెట్లో Realme 9i స్మార్ట్ ఫోన్ ధర రూ.14,499కు అందుబాటులో ఉండనుంది.

Post a Comment

0 Comments