ఫుడ్ డెలివరీ లో సరికొత్త రికార్డు !


కరోనా కొత్త వేరియంట్ కారణంగా ఎప్పటిలా అందరూ బయట రెస్టారెంట్లకు వెళ్లే పరిస్థితి లేదు. ఒమిక్రాన్ భయంతో ఆన్‌లైన్‌లోనే రెస్టారెంట్ల నుంచి ఫుడ్ డెలివరీ ఇంటికి తెప్పించుకుంటున్నారు. ఇంట్లోనే ఉండి న్యూ ఇయర్ వేడుకులను జరుపుకునేందుకు రెడీ అవుతున్నారు. సరిగ్గా ఇదే సమయాన్ని ఫుడ్ డెలివరీ యాప్స్ వినియోగించుకుంటున్నాయి. అందులో ఇండియాలో బాగా పాపులర్ ఫుడ్ డెలివరీ యాప్స్.. రెండే రెండు.. అవే.. స్విగ్గీ , జొమాటో ఈ రెండింటికి నగరాల్లో ఫుడ్ ఆర్డర్లు విపరీతంగా పెరిగిపోయాయి. రెస్టారెంట్లకు వెళ్లకుండా.. ఇంటి నుంచే ఆహార పదార్థాలను ఆర్డర్ చేసేస్తున్నారు. హోం డెలివరీ సదుపాయం ఉండడంతో కోట్లాది మంది ఈ రెండు యాప్స్ వినియోగిస్తున్నారు. కరోనా వైరస్ ప్రభావంతో ఈ యాప్స్‌లో ఫుడ్ ఆర్డర్లు గణనీయంగా పెరిగాయి. 2022 న్యూ ఇయర్ సందర్భంగా పాపులర్ ఫుడ్ డెలివరీ యాప్స్ స్విగ్గీ, జొమాటో సరికొత్త రికార్డు క్రియేట్ చేశాయి. 2021లో మాదిరిగానే 2022 కొత్త ఏడాదిలో కూడా అదే జోరు కొనసాగిస్తున్నాయి. గత ఏడాదిలో ఈ రెండు క్రియేట్ చేసిన సొంత రికార్డులను బ్రేక్ చేశాయి. నిమిషానికి Swiggy ఆర్డర్‌లు.. ఇన్‌స్టంట్ గ్రోసరీ సర్వీస్ ఇన్‌స్టామార్ట్‌ను మినహాయించాయి. జొమాటో.. నిమిషానికి 7,100 ఆర్డర్లు పూర్తి చేస్తే.. స్విగ్గీ నిమిషంలో 9వేల ఆర్డర్లను క్రాస్ చేసింది. డిసెంబర్ 31, 2021, రాత్రి 8.20 గంటల సమయానికి నిమిషంలో ఈ రెండు యాప్స్ ఒక్కొక్కటిగా రికార్డు స్థాయిలో ఆర్డర్లను దాటేశాయి. ఈ రెండు యాప్స్.. రోజులో 1.5 మిలియన్ల ఆర్డర్లను క్రాస్ చేశాయి. గతంలో 2021 కొత్త ఏడాది సందర్భంగా జొమాటో నిమిషానికి 4వేల ఆర్డర్లను క్రాస్ చేయగా.. స్విగ్గీ అదే సమయంలో 5వేల ఆర్డర్లను దాటేసింది. ఆన్‌లైన్ ఆర్డర్‌లు వేగంగా నిర్వహించేందుకు UPI ద్వారా డిజిటల్ పేమెంట్ చేసుకోవచ్చు. అయితే చాలా మంది వినియోగదారులు పేమెంట్స్ చేసే సమయంలో ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయినట్టు ఫిర్యాదు చేశారు. దీనిపై జొమాటో వ్యవస్థాపకుడు CEO దీపిందర్ గోయల్ మాట్లాడుతూ.. UPI సక్సెస్ రేటు అన్ని యాప్‌లలో 70శాతం నుంచి 40శాతానికి బాగా తగ్గిందని తెలిపారు.

Post a Comment

0 Comments