ఫ్లిప్‌కార్ట్ లో వివో ఫోన్ పై డిస్కౌంట్ ఆఫర్ !


ఇండియాలో ఇటీవల రెండు స్మార్ట్ ఫోన్లను వివో విడుదల చేసింది. వివో వి23 మరియు వివో వి23 ప్రో భారతదేశంలో రంగులు మార్చే మొదటి స్మార్ట్‌ఫోన్‌లు కావడం విశేషం. ఇందులో వివో వి23 స్మార్ట్ ఫోన్ నేటి నుంచి అమ్మకానికి ఉంచారు. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో నడుస్తున్న బిగ్ సేవింగ్ డేస్‌లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. అయితే, ఈ సేల్ లో ఈ ఫోన్ పై ప్రస్తుతం రూ.2,500 వరకు డిస్కౌంట్ అందుబాటులో ఉండడం విశేషం. వివో వి23 ఫోన్ భారతదేశంలో రూ. 29,990 నుంచి అమ్మకానికి ఉంచారు. ఈ ఫోన్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. వివో వి23 8GB + 128GB వేరియంట్ ధర రూ.29,990. రెండవ వేరియంట్ 12GB + 256GB. దీని ధర రూ. 34,990. ఇప్పటి వరకు ఫోన్ ప్రీ-ఆర్డర్ కోసం మాత్రమే అందుబాటులో ఉండేది. ఈ ఫోన్ పై భారీ డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ మీ పాత ఫోన్ ను ఎక్సేంజ్ చేయడం ద్వారా మీరు రూ.16,950 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. ఇంకా హెచ్ డి ఎఫ్ సి  క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్‌లపై 2500 రూపాయల తగ్గింపును పొందొచ్చు.

Post a Comment

0 Comments