Header Ads Widget

స్మార్ట్ ఫోన్ - జాగ్రత్తలు !


స్మార్ట్ ఫోన్లు మనుషుల దైనందీన జీవితంలో భాగమైపోయ్యాయి. అవసరానికి ఏమున్నా లేకున్నా స్మార్ట్ ఫోన్లకు బానిసవుతున్నారు నిద్ర లేవడాం మొదలు నిద్రపోయే వరకు  ప్రాణ స్నేహితుడిగా మారిపోయింది. అవసరం కంటే ఎక్కువగా వాడుతున్నారు. ఫలితంగా విజ్ఞానం మాట అలా ఉంచితే భద్రత పరంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా పిల్లలు స్మార్ట్ ఫోన్ కు ప్రభావితమవుతున్నారు. వీరి సంరక్షణ బాధ్యత తల్లిదండ్రులపైనే ఉంటుంది. మీ సెల్ ఫోన్ కు ఎప్పుడూ లాక్ పెట్టుకోవాలి. కీప్యాడ్ లాక్ అందులో ప్రధానం. పిన్ లేదా పాస్వర్డ్ ను పెట్టుకోవడం వల్ల భద్రంగా ఉంచుకోవచ్చు. వేరేవాళ్లు మీ ఫోన్ లాక్కున్నా, దొంగిలించినా వారికి సమస్యగా మారుతుంది. సెక్సువల్ నేచర్ కు సంబంధించిన వీడియోలు, ఫొటోలు తీయకండి. ఎవరైనా నగ్నంగా లేదా అర్ధనగ్నంగా ఉన్న ఫొటోలు, వీడియోలు మీ వద్ద ఉంటే అవి చట్టరీత్యా నేరంగా పరిగణిస్తారు. ఛైల్డ్ పోర్నోగ్రఫి, అశ్లీలత అన్నీ రాష్ట్రాల్లో నిషేధించారు. ఇది ఘోరమైన నేరంగా పరిగణిస్తారు. మరో విషయమేమంటే ఫోన్ ను తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా చూసుకోండి. లేదంటే మీ ప్రతిష్ట దెబ్బతినే అవకాశముంది. సెల్ ఫోన్ ను కలిగి ఉండటమనేది స్వతంత్ర అధికారం. అంతేకాని ప్రత్యేకమైన హక్కు కాదనే విషయాన్ని గుర్తుంచుకోండి. తల్లిదండ్రులు మీకు ఫోన్ ఇవ్వడానికి అనుమతిచ్చారంటే మీరు ఆ గౌరవాన్ని కాపాడుకోవాలి. అయితే చాలా మంది యువత ఎలక్ట్రానిక్ పరికరాలను, సోషల్ మీడియాను దుర్వినియోగం చేసి వారి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. క్రిమినల్, చట్టపరమైన ఇబ్బందుల్లో ఇరుక్కుంటున్నారు. కాబట్టి తల్లిదండ్రులు ఇచ్చిన స్వేచ్ఛ విలువైందిగా భావించండి. మీకు సౌకర్యవంతంగా లేని ఫొటోలు, వీడియోలను మీ తల్లిదండ్రులకు షేర్ చేయవద్దు. అలాంటి సందేశాలు కూడా పంపవద్దు. ఫోన్ లో ఉండే సందేశాలు, మీరు సృష్టించే ఫొటోలు, వీడియోలు డిజిటల్ సాక్ష్యంగా నిల్వ చేయబడతాయి. మీరు డిలీట్ చేసినప్పటికీ మొబైల్ కంపెనీ సర్వర్లలోనో, క్లౌడ్ ఖాతా, మెమొరీ కార్డు, సిమ్ కార్డు లాంటి వాటిలో సేవ్ చేస్తారు. చట్టాన్ని ఉల్లఘించినట్లు సహేతుకమైన అనుమానం వచ్చిట్లయితే నిబంధనల ప్రకారం పాఠశాల యజమాన్యం మీ సెల్ ఫోన్ తీసుకునే అవకాశముంది. మీ తల్లిదండ్రుల వచ్చి అభ్యర్థిస్తే ఫోన్ తిరిగి పొందవచ్చు. ఎప్పుడూ టెక్స్ట్ చేసి డ్రైవ్ చేయవద్దు. మీ జీవితాన్ని కోల్పోవడం లేదా వేరొకరిని తీసుకోవడం ఏది ఉత్తమం కాదు. ఏదైనా అత్యవసరమైతే, దానితో వ్యవహరించే ముందు వాహనాన్ని సురక్షితమైన ప్రదేశం వద్ద ఆపండి. మీరు విశ్వసించగలగిన, మీకు తెలిసిన వ్యక్తులకు మాత్రమే మీ ఫోన్ నంబర్ ఇవ్వండి.

Post a Comment

0 Comments