Ad Code

ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్ నాట్ ఫ్రీ?


మీరు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో చురుగ్గా పాల్గొంటున్నారా.. అంతా ఇప్పటి వరకు సోషల్ మీడియా ఖాతాల్లో ఫ్రీగా సబ్ స్క్రిప్షన్ పొందుతున్నారు. కానీ ఇక నుంచి అలా కుదరదు. ఫేస్‌బుక్‌. ఇప్పుడు మేటా అనుబంధ ప్లాట్‌పామ్ ఇన్‌స్టాగ్రామ్ సబ్ స్క్రిప్షన్ ఇక ఎంత మాత్రమూ ఉచితం కాదు. నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ఖరారు చేస్తున్నది ఇన్‌స్టా మేనేజ్‌మెంట్‌. ఇన్‌స్టాగ్రామ్ కంటెంట్ పొందాలంటే ప్రతి నెలా రూ.73 ఫీజు చెల్లించాలి. ఇప్పటికైతే ఇన్‌స్టాగ్రామ్ సబ్ స్క్రిప్షన్ గురించి అధికారిక పాలసీ ప్రకటించలేదు. ప్రస్తుతానికి అమెరికాలో ఈ సబ్‌స్క్రిప్షన్ అమలు చేస్తున్నారు. మున్ముందు ప్రపంచవ్యాప్తంగా క్రియేటర్లందరికీ వర్తింపజేయబోతున్నారు. దీనివల్ల బెనిఫిట్లు కూడా ఉన్నాయి. డబ్బు చెల్లించిన సబ్ స్క్రైబర్లు యూజర్ల ఫేవరెట్ క్రియేటర్ల డేటా. కంటెంట్ పొందొచ్చు. మరోవైపు ఇన్‌స్టా క్రియేటర్ డబ్బు కూడా సంపాదించొచ్చు. కంటెంట్ క్రియేటర్లు తమ ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ కోసం తమ ఫాలోవర్లపై చార్జీ వసూలు చేయొచ్చు. లైవ్ వీడియోలు, వీడియో కంటెంట్ కోసం క్రియేటర్లు ఖాతాను సబ్‌స్క్రైబ్ చేసుకోవాలి. ప్రస్తుతం అమెరికాలో 10 మంది క్రియేటర్లు ప్రయోగాత్మకంగా దీన్ని పరీక్షిస్తున్నారు. నెలవారీ సబ్‌స్క్రిప్షన్ 0.99 డాలర్లు (సుమారు రూ.73) నుంచి 9.99 డాలర్లు (సుమారు రూ.743) మధ్య ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో అమెరికన్ క్రియేటర్లు ప్రయోగాత్మకంగా ఈ సబ్‌స్క్రిప్షన్ ఫీచర్‌ను పరీక్షిస్తున్నారు. కొన్ని వారాల్లో దీన్ని ఇన్‌స్టాగ్రామ్ మేనేజ్ మెంట్ దీన్ని ప్రారంభించనున్నది. దీంతోపాటు మరింత మంది క్రియేటర్లు పరీక్షిస్తారు. ఈ సబ్‌స్క్రిప్షన్ ఫీచర్ కింద ఎంచుకున్న వారికి బ్యాడ్జి ఇస్తారు. ఇన్‌స్టాగ్రామ్ యూజర్లు తమ ఫేవరెట్ క్రియేటర్ల కంటెంట్ చూడొచ్చు. రూ.73 చెల్లించిన వారికి సబ్‌స్క్రిప్షన్ తోపాటు బ్యాడ్జి కూడా ఇస్తారు. మీ యూజర్ నేమ్ ముందు ఈ బ్యాడ్జి వస్తూ ఉంటుంది. సబ్ స్క్రిప్షన్ యూజర్‌ను ఈ బ్యాడ్జి ఐడెంటిఫై చేస్తుంది. సబ్‌స్క్రిప్షన్ తర్వాత క్రియేటర్ల ఆదాయం, వారి సభ్యత్వం గడువు తేదీ కనిపిస్తాయి.


Post a Comment

0 Comments

Close Menu