Ad Code

తొలి సోలార్​ పవర్​ హెడ్​ఫోన్లు​ విడుదల !


స్వీడన్​కు చెందిన ప్రీమియం లైఫ్​ స్టైల్​ ఆడియో బ్రాండ్ అర్బనిస్టా  భారత మార్కెట్​లోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 90 దేశాల్లో అర్బనిస్టా ఆడియో ఉత్పత్తులు  అందుబాటులో ఉన్నాయి. 30 వేలకు పైగా గ్లోబల్​ స్టోర్లతో ప్రపంచంలోనే అగ్రగామి ఆడియో బ్రాండ్​గా అర్బనిస్టా రాణిస్తోంది. ఇప్పుడు ఈ కంపెనీ భారత మార్కెట్​పై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా న్యూఢిల్లీలో అర్బనిస్టా కార్యాలయాన్ని ప్రారంభించింది. కంపెనీ నుంచి గతంలో గ్లోబల్​ మార్కెట్​లోకి వచ్చిన లాస్ ఏంజెల్స్​ టీడబ్ల్యూఎస్​ ఇయర్​బడ్స్​​, లిస్బాన్​ మోడల్​ ఇయర్​ఫోన్లను తాజాగా భారత మార్కెట్​లోకి ప్రవేశపెట్టింది. లాస్​ ఏంజెల్స్​ టీడబ్ల్యూఎస్​ ఇయర్​బడ్స్​ను సోలార్​ పవర్​తో ఛార్జ్​ చేసుకునే అవకాశం ఉంటుంది. సోలార్​ పవర్​తో ఛార్జ్​ చేయగలిగే మొదటి ఆడియో ప్రొడక్ట్ ఇదే కావడం విశేషం. ప్రపంచంలోనే అతి చిన్న టీడబ్ల్యూఎస్​ ఇయర్​బడ్స్ మోడల్​గా లిస్​బాన్​ మోడల్ రాణిస్తోంది. దీన్ని కూడా భారత మార్కెట్​లోకి ప్రవేశపెట్టింది. ఈ సందర్బంగా అర్బనిస్టా సీఈవో అండర్స్ ఆండ్రీన్ మాట్లాడుతూ "భారత మార్కెట్‌కు మా ప్రొడక్ట్స్‌ను పరిచయం చేయడానికి మేము చాలా సంతోషిస్తున్నాము. ప్రపంచ మొబైల్​ క్యాపిటల్​గా భారత్​ రాణిస్తున్నందున, మా బ్రాండ్​ ఉత్పత్తులు కచ్చితంగా భారతీయులను ఆకట్టుకుంటాయని ఆశిస్తున్నాం." అని పేర్కొన్నారు. అర్బనిస్టా ఇండియా హెడ్, విజయ్ కణ్ణన్ మాట్లాడుతూ, "మా ప్రొడక్ట్స్ భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాల్లోని ప్రీమియం ఆఫ్‌లైన్ రిటైలర్ స్టోర్‌లలో అందుబాటులో ఉన్నాయి. మేము త్వరలోనే వీటిని భారతదేశంలోని ఎంపిక చేసిన యాపిల్ ప్రీమియం ఐఫోన్ స్టోర్‌లలో అందుబాటులోకి తెస్తాం. మా ఉత్పత్తులు ఈ నెలాఖరు నాటికి భారతదేశంలోని దాదాపు 100 ప్రీమియం రీటైలర్‌లలో అందుబాటులో ఉంటాయి. మార్చి చివరి నాటికి మరో 500 మంది రిటైలర్​ స్టోర్లలోకి అందుబాటులోకి తీసుకొస్తాం. మా ఉత్పత్తులు అమెజాన్​, ఫ్లిప్​కార్ట్​తో సహా అన్ని ప్రధాన ఈ-కామర్స్​ ప్లాట్​ఫామ్​లలో కూడా అందుబాటులో ఉంటాయి" అని తెలిపారు.

Post a Comment

0 Comments

Close Menu