Ad Code

జూన్ నాటికి సిట్రోయెన్ సి3 లాంచ్ ?


సిట్రోయెన్ కంపెనీ ఇండియన్ మార్కెట్లో మరో కొత్త SUV కార్ ని విడుదల చేయనుంది. ఈ SUV 'సిట్రోయెన్ సి3'. ఇప్పటికే కంపెనీ తన సి5 మోడల్ అమ్ముతుంది. కంపెనీ త్వరలోనే సి3 అనే చిన్న SUV కార్ ని తీసుకురానుంది. ఇది కంపెనీ నుంచి ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టనున్న రెండవ మోడల్. ఇది 2022 జూన్ నాటికి ఇండియన్ మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది.ఇక త్వరలో రానున్న కొత్త సిట్రోయెన్ సి3 SUV కంపెనీ స్టాండర్డ్ మాడ్యులర్ అనేది ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. ఇప్పటికే ఈ SUV కార్ స్పాట్ టెస్ట్ లో చాలాసార్లు కనిపించడం జరిగింది. సిట్రోయెన్ సి3 SUV కార్ ని కంపెనీ 'మేడ్ ఇన్ ఇండియా ఫర్ ఇండియన్స్'గా అభివర్ణించడం జరిగింది. కాబట్టి ఇది భారతదేశంలోనే ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది.ఇండియాలోని కాంపాక్ట్ SUV సెగ్మెంట్ లో బలమైన ప్రత్యర్థులు ఉండటం వల్ల రానున్న ఈ సి3 SUV గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఇది మిగిలిన ప్రత్యర్థులకంటే కూడా చాలా ప్రత్యేకంగా ఇంకా అలాగే కొంత భిన్నంగా ఉండాలి. కాబట్టి ఈ సిట్రోయెన్ సి3 SUV 78 విభిన్న యాక్ససరీస్ తో ఇంకా అలాగే అనేకరకాల కస్టమైజేషన్ ఆప్సన్స్ తో రానుంది.కేవలం అది మాత్రమే కాకుండా.. ఈ సబ్-4మీ SUV 4 కార్ విభిన్న ఎక్స్టీరియర్ కలర్ ఆప్సన్స్ పొందటమే కాకుండా ఇంకా అలాగే రెండు వేర్వేరు రూఫ్ కలర్ ఆప్షన్‌లతో కూడా అందుబాటులోకి వస్తుంది. కాబట్టి ఇది చూడటానికి ఎంతగానో ఆకర్షణీయంగా ఉంటుంది. అందుకే చూపరులను ఒక్క సారికే కట్టిపడేస్తుంది.అలాగే ఇందులోని ఇంటీరియర్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో పెద్ద 10-ఇంచెస్ టచ్‌స్క్రీన్ సిస్టమ్‌ అనేది ఉంటుంది. ఇది ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో ఇంకా అలాగే నావిగేషన్ వంటి విభిన్న ఫీచర్స్ అందిస్తుంది. అంతే కాకూండా, సి3 SU లో 1-లీటర్ గ్లోవ్ బాక్స్, ముందు ఇంకా వెనుక రెండు 2-లీటర్ డోర్ పాకెట్‌లు ఉన్నాయి. దీనితో పాటు, సెంట్రల్ కన్సోల్‌లో స్టోరేజ్ ఇంకా అలాగే స్మార్ట్‌ఫోన్ హోల్డర్‌గా పనిచేసే వెనుక భాగంలో రెండు కప్పు హోల్డర్లు అనేవి ఇవ్వబడ్డాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు డ్రైవింగ్ టైంలో ఎంతగానో అనుకూలంగా ఉంటాయి.

Post a Comment

0 Comments

Close Menu