Ad Code

శాంసంగ్ గెలాక్సీ A03 భారత్ లో విడుదల


శాంసంగ్ బడ్జెట్ శ్రేణి స్మార్ట్ ఫోన్ లలో భాగంగా కొత్త “గెలాక్సీ A03” స్మార్ట్ ఫోన్ ను భారత్ మార్కెట్లో విడుదల చేసింది. ఇప్పటివరకు బడ్జెట్ కంటే ఎక్కువ ధర ఉన్న ఫోన్ లనే మార్కెట్ చేసుకోవాలని భావించిన శాంసంగ్ ఆ విభాగంలో చైనా సంస్థల పోటీ తట్టుకోలేకపోయింది. ఇక శాంసంగ్ లో హైఎండ్ ఫోన్లు వినియోగదారులను ఆకట్టుకున్నా ధరను చూసి వెనకడుగు వేస్తున్నారు. 6.5-అంగుళాల TFT డిస్‌ప్లే HD+ రిజల్యూషన్, 60Hz రిఫ్రెష్ రేట్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ అద్భుతంగా ఉంటుంది. 3GB RAM + 32GB మరియు 4GB RAM + 64GB మెమరీ స్టోరేజి ఆప్షన్స్ తో వస్తుంది. Unisoc T606 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌, ఆండ్రాయిడ్ 11 ఆధారిత One UI 3.1ఓఎస్ తో ఈ ఫోన్ పనిచేస్తుంది. ఈ Galaxy A03లో వెనుక భాగంలో 48MP + 2MP డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ముందు భాగంలో 5MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. 5,000mAh బ్యాటరీ సుమారు రెండు రోజుల పాటు ఛార్జింగ్ ఇస్తుందని సంస్థ పేర్కొంది. ఈ “గెలాక్సీ A03” స్మార్ట్ ఫోన్లో 4G LTE, Wi-Fi, బ్లూటూత్ v4.2, USB టైప్-C పోర్ట్, A-GPS వంటి అధునాతన ఫీచర్స్ ఉన్నాయి. బ్లాక్, బ్లూ, రెడ్ కలర్స్ లో లభించే ఈ ఫోన్ వినియోగదారులను తప్పకుండ ఆకట్టుకుంటుందని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ధర విషయానికొస్తే..3GB RAM + 32GB వేరియంట్ ధర రూ.10,499గానూ, 4GB RAM + 64GB వేరియంట్ ధర రూ.11,999గానూ నిర్ణయించారు. ఇండియాలో శాంసంగ్ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లతో పాటు ప్రముఖ మొబైల్ షాపులు, ఈ-కామర్స్ సైట్లలలోనూ ఈ కొత్త “గెలాక్సీ A03” స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉంది.

Post a Comment

0 Comments

Close Menu