Ad Code

వైఫై స్లో అయిందా?


స్మార్ట్ ఫోన్, ఆండ్రాయిడ్ టీవీ, ల్యాప్‌టాప్ ఇలా ఏదైనా ప్రతి అవసరానికి వైఫై కావాల్సిందే. అలెక్సా అంటూ మొదలవుతున్న మన జీవితాల్లో వైఫై కూడా ఒక భాగమైపోయింది. అలాంటప్పుడు సడెన్ గా స్లో అయిపోయినా, మీ వైఫైని ఎవరైనా హ్యాక్ చేసి వాడేస్తు్ననారని అనుమానం వచ్చినా మీ సెక్యూరిటీని పెంచుకోండి. ఇంటర్నెట్ నెట్‌వర్క్ కనెక్ట్ చేసి ఉన్న డివైజ్ లో వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. 192.168.0.1/192/.168.1.1/192.168.2.1 లలో ఏదో ఒక వెబ్ అడ్రస్ ను ఎంటర్ చేసి రూటర్ లో లాగిన్ అవ్వండి. ఇవి  పనిచేయకపోతే సిస్టమ్ లో కమాండ్ ప్రాప్ట్ ని ఓపెన్ చేయాలి. అక్కడే డిఫాల్ట్ గేట్ వే పక్కన రూటర్ ఐపీ అడ్రస్ కనిపిస్తుంది. అక్కడ యూజర్ నేమ్, పాస్‌వర్డ్ ఎంటర్ చేయాలి. రూటర్ పాస్‌వర్డ్ తెలియకపోతే వైఫై రూటర్ మీద ఉన్న స్టిక్కర్ పై చెక్ చేసి రీసెట్ చేసుకోవచ్చు. లాగిన్ అయ్యాక.. వైఫై కు కనెక్ట్ అయిన డివైజ్ లు కనిపిస్తాయి. అలాగే కమాండ్ లో arp-a అని టైప్ చేసి ఎంటర్ నొక్కడంతో వైఫైకు కనెక్ట్ అయి ఉన్న డివైజ్ లు కనిపిస్తాయి. ఇతరుల అకౌంట్లు డిలీట్ చేసి సర్వీస్ ను ఫాస్ట్ చేసుకోవచ్చు.తరచూ యూజర్ నేమ్, పాస్వర్డ్ లను మారుస్తూ ఉండటం మర్చిపోకండి.

Post a Comment

0 Comments

Close Menu