Ad Code

మీ పేరుపై ఎన్ని సిమ్‌ కార్డులు ఉన్నాయి..?


ప్రస్తుతం ప్రతి ఒక్కరు ఫోన్‌ ఉపయోగించుకునేదే. ఫోన్‌ కాల్స్‌ కోసం జియో, ఎయిర్‌ టెల్‌, వొడాఫోన్‌ ఐడియా, బీఎస్‌ఎన్‌ఎల్‌ ఇలా సిమ్‌ కార్డులు ఎవరికి నచ్చినట్లు వారు వాడుతుంటారు. అయితే చాలా మంది ఎన్నో సిమ్‌ కార్డులను తీసుకుంటారు. గతంలో టెలికం కంపెనీలు ఉచిత బ్యాలెన్స్‌, వ్యాలిడిటీ ఇచ్చిన సమయంలో ఒకటి కంటే ఎక్కువ సిమ్‌ కార్డులను తీసుకుని , బ్యాలెన్స్‌, వ్యాలిడిటీ అయిపోయిన తర్వాత పక్కనపడేస్తుంటారు. అలాగే కొందరు సిమ్‌ కార్డులను పోగొట్టుకుంటారు. తర్వాత వేరే సిమ్‌ కార్డు తీసుకోవడం, లేదా ఒకటి కంటే ఎక్కువ సిమ్‌ కార్డులను ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరికి 9 సిమ్‌ కార్డులు మాత్రమే ఉండాలని, అంతకంటే ఎక్కువ సిమ్‌ కార్డులు ఉంటే తొలగించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇక కొందరికైతే వారి పేరుపైన ఎన్ని సిమ్‌ కార్డులు ఉన్నాయనే విషయం కూడా తెలియదు. కానీ ఇప్పుడు టెక్నాలజీ అభివృద్ది చెందిన కారణంగా ఒక వ్యక్తిపై ఎన్ని సిమ్‌ కార్డులు ఉన్నాయో తెలుసుకోవచ్చు. అలాగే ఒక వేళ వాడని సిమ్‌ కార్డులు ఉంటే కూడా వాటిని బ్లాక్‌ చేసుకోవచ్చు. కొందరు సైబర్‌ నేరగాళ్లు ఇతరుల పేర్లపై సిమ్‌ కార్డులను తీసుకుని మోసాలకు పాల్పడుతుంటారు. ఆధార్‌తో లింకైన సిమ్‌ కార్డుల దుర్వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని టెలికాం శాఖ ఇటీవల టూల్‌ అనలటిక్స్‌ ఫర్‌ ఫ్రాడ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ కన్జూమర్‌ ప్రొటెక్షన్‌ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆన్‌లైన్‌ టూల్‌, పోర్టల్‌తో యూజర్లు ఆధార్‌ నెంబర్‌తో లింకైన మొబైల్‌ నెంబర్లను అన్నింటిని తెలుసుకునే వెసులుబాటు ఉంది. ఈ వెబ్‌సైట్‌ ద్వారా మీ ఆధార్‌ కార్డు పై ఇప్పటి వరకు ఎన్ని సిమ్‌ కార్డులను ఉపయోగించారో తెలుసుకోవచ్చు. ఇక మీకు తెలియకుండా మీ ఆధార్‌ నెంబర్‌తో ఏదైనా ఫోన్‌ నెంబర్‌ లింకైనట్లు తేలినట్లయితే మీరు ఫిర్యాదు చేయవచ్చు. ఈ వెబ్‌సైట్‌ ద్వారా మీ పేరుపై పేరుపై ఎన్ని సిమ్‌ కార్డులు ఉన్నాయో తెలుసుకోవచ్చు. దీని వల్ల మీరు మోసాల బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు. మీరు https://tafcop.dgtelecom.gov.in/ వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీ ఫోన్‌ నెంబర్‌ను ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ మొబైల్‌ నెంబర్‌కు వచ్చిన ఓటీపీ (OTP)ని ఎంటర్‌ చేస్తే మీ పేరుపై ఉన్న మొబైల్‌ నెంబర్లు కనిపిస్తాయి. వాటిని బ్లాక్‌ చేసుకునే సదుపాయం కూడా ఉంటుంది.

Post a Comment

0 Comments

Close Menu