Ad Code

వాట్సాప్ లో ఇకపై బ్యాగ్రౌండ్ లోనూ వాయిస్ మెసేజ్


వాట్సాప్ లో  బ్యాక్‌గ్రౌండ్‌లోనూ వాయిస్ మెసేజ్‌లను ప్లే చేయొచ్చని తెలుస్తోంది. Apple యాప్ స్టోర్ పేజీలో ఈ ఫీచర్‌ను WhatsApp ధ్రువీకరించింది. దీని ద్వారా యూజర్లు చాట్ విండో నుంచి బయటకు వచ్చి కూడా వాయిస్ మెసేజ్‌, ఆడియో ఫైల్‌లను ప్లే చేసుకోవచ్చు. యాప్ ను క్లోజ్ చేసినప్పటికీ వాయిస్ మెసేజ్ లను ప్లే చేసేలా కొత్త అప్‌డేట్‌ను వాట్సాప్ విడుదల చేస్తోంది. ప్రస్తుతం వాట్సాప్ లో వాయిస్ మెసేజ్ ని ప్లే చేయవచ్చు. దాన్ని ఫార్వర్డ్ కూడా చేయవచ్చన్న విషయం వినియోగదారులకు తెలిసిందే. అయితే చాట్ నుంచి బయటకు వెళ్లగానే ఆటోమేటిక్ గా ఇది పాజ్ అయిపోతుంది. పర్టికులర్ చాట్ నుంచి మరో చాట్‌లోకి మారినప్పటికీ బ్యాక్‌గ్రౌండ్‌లో ఆడియో కట్ అయిపోతుంది. దీనిపై వినియోగదారుల డిమాండ్లకు అనుగుణంగా వాట్సాప్ చర్యలు చేపట్టిన్నట్లు తెలుస్తోంది. iOS వెర్షన్ 22.4.75 ఫోన్లో డిఫాల్ట్ గా వచ్చే WhatsAppలో దీనికి సంబంధించి కొత్త ఫీచర్ ను గుర్తించినట్లు టెక్ నిపుణులు చెబుతున్నారు. భారతదేశంలోని వినియోగదారులకు సైతం ఇది అందుబాటులో ఉందని సమాచారం. అయితే ఆండ్రాయిడ్, వాట్సాప్ వెబ్ లో ఇది అందుబాటులో ఉందా లేదా అనే వివరాలు తెలియాల్సి ఉంది. Apple App Store అప్డేట్ పేజీలో WhatsApp కొత్త ఫీచర్ కు సంబంధించిన సమాచారాన్ని పొందుపరిచారు. ప్రస్తుతానికి ఈ అప్‌డేట్ పై మరింత సమాచారం అందుబాటులో లేనప్పటికీ, కొందరు వినియోగదారులు దీనిని ధ్రువీకరిస్తున్నారు. మరోవైపు.. WhatsApp గ్రూప్ అడ్మిన్‌లు ఆయా గ్రూప్ లపై మరింత నియంత్రణ కలిగి ఉండేదుకు WhatsApp కమ్యూనిటీ ఫీచర్‌ను మెరుగుదిద్దేందుకు మరింత కృషి చేస్తున్నట్లు ఫేస్ బుక్ మాతృ సంస్థ మెటావర్స్ నేతృత్వంలోని వాట్సాప్ ప్రకటించింది. డిస్కార్డ్ కమ్యూనిటీ ఇన్స్పిరేషన్ తో.. WhatsApp కమ్యూనిటీ తప్పనిసరిగా పాటించవలసిన విభిన్న విషయాలతో ఓ జాబితాను రూపొందించింది. కమ్యూనిటీ నిర్వాహకులు తమ వినియోగదారులందరికీ మెసేజ్‌లను ఒకేసారి పంపొచ్చు. అదనంగా వినియోగదారులు తమ గ్రూప్ లకు మాన్యువల్‌గా సభ్యులను యాడ్ చేయవచ్చు. లేదా గ్రూప్ లో చేరేందుకు లింక్‌లను పంపవచ్చు. ఇక పర్టికులర్ గ్రూప్ కాకుండా.. ఇతర ఎంపిక చేసిన గ్రూప్ సభ్యులకూ కొత్త ఇంటర్‌ఫేస్‌ను యాడ్ చేస్తుంది. ఈ కొత్త అప్‌డేట్ తో గ్రూప్ చాట్‌లో ఎవరు మాట్లాడుతున్నారో గుర్తించడంలో యూజర్స్ కి హెల్ప్ చేస్తుంది. ఎక్కువమంది కలిగిన గ్రూప్ లకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది.

Post a Comment

0 Comments

Close Menu