Ad Code

రిమోట్‌తోనే మీ టీవీ ఆఫ్ చేస్తున్నారా?


ఇండియాలోని దాదాపు 70 శాతం మంది కుటుంబాలు తమ టీవీలను మెయిన్ స్విచ్ ద్వారా కాకుండా రిమోట్  కంట్రోల్‌ని ఉపయోగించి స్విచ్ ఆఫ్ చేస్తున్నారని ఓ రీసెంట్ నివేదిక వెల్లడించింది. ఇలా టీవీలను మెయిన్ స్విచ్ దగ్గర కాకుండా రిమోట్ యూజ్ చేసి ఆఫ్ చేయడం వల్ల కరెంటు బిల్లు తడిసి మోపెడుతుంది. నమ్మడానికి కాస్త కష్టంగా ఉన్నా ఇదే నిజం! రిమోట్‌తో స్విచ్ ఆఫ్ చేసే టీవీలు ఎలక్ట్రిసిటీని కంటిన్యూగా వాడుకుంటూనే ఉంటాయి. ఎందుకంటే రిమోట్ ద్వారా ఆఫ్ చేస్తే ఇవి స్టాండ్‌బై మోడ్‌లోకి వెళ్లిపోతాయి. దీనివల్ల కరెంటు ఖర్చయి టీవీ చూడకపోయినా బిల్లు పెరుగుతుంది. ఈ విషయాన్ని ప్రజలు తప్పక గుర్తించాలి. ఇలాంటి చిన్న విషయాలు విస్మరిస్తే సంవత్సరానికి రూ.1200 డబ్బు మీరు అనవసరంగా వెచ్చించాల్సి వస్తుంది. అందుకే ఆఫ్ చేసిన ఎలక్ట్రికల్ వస్తువుల వల్ల అనవసరంగా విద్యుత్ వినియోగం పెరుగుతుందని గుర్తించి వాటిని మెయిన్ స్విచ్ దగ్గర ఆఫ్ చేయడం మంచిది. ఎలక్ట్రానిక్ వస్తువులను ఎప్పుడూ కూడా స్టాండ్‌బైలో ఉంచకూడదు. ఎందుకంటే అవి డోర్మాంట్ మోడ్‌లో రన్ కావడానికి ప్లగ్ సాకెట్ నుంచి విద్యుత్‌ను వినియోగిస్తూనే ఉంటాయి. టీవీ సెట్ విషయంలో టీవీ అన్ని సమయాల్లో రిమోట్ కంట్రోల్‌కు ఫంక్షనల్‌గా ఉండేందుకు విద్యుత్తును ఉపయోగిస్తూనే ఉంటుంది. రిమోట్ ద్వారా ఆఫ్ చేసినప్పుడు మళ్లీ అది రిమోట్ ద్వారానే ఆన్ కావాలంటే ఎలక్ట్రిసిటీ టీవీలో ఎల్లప్పుడూ పాస్ అవుతూనే ఉండాలి. ఇలా టీవీ ఎప్పటికప్పుడు ఎలక్ట్రిసిటీని వినియోగించుకుంటుంది. దీనివల్ల మీరు టీవీ ఆఫ్ చేసినా బ్యాక్‌గ్రౌండ్‌లో ఎలక్ట్రిసిటీ వినియోగం పెరుగుతుంది. స్టాండ్‌బైలో టీవీ వినియోగించే విద్యుత్ లేదా ఎలక్ట్రిసిటీ మొత్తం దాని టెక్నాలజీ, మోడల్, సైజు అలాగే దాని ఎఫిషియన్సీపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా తయారీదారులు అన్ని ఎలక్ట్రానిక్ వస్తువులకు పవర్ రేటింగ్ అందిస్తారు. ఇది ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ రన్ అవ్వడానికి ఎంత విద్యుత్ వినియోగిస్తుందో వినియోగదారుకు సూచిస్తుంది. ఈ రేటింగ్ వాట్ లేదా కిలోవాట్‌లో ఇవ్వడం జరుగుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, స్టాండ్‌బైలో ఉన్న టీవీ గంటకు 10 వాట్ల వరకు వినియోగించగలదు. వ్యక్తిగత వినియోగం, జియోలొకేషన్ వంటి అంశాల ఆధారంగా విద్యుత్ వినియోగం కూడా మారుతుందని గమనించాలి. టీవీని స్టాండ్‌బైలో ఉంచడం, రిమోట్ కంట్రోల్ ద్వారా మాత్రమే స్విచ్ ఆఫ్ చేయడం అలవాటు చేసుకోవడం వల్ల నెలవారీ విద్యుత్ బిల్లు రూ. 100 వరకు పెరిగే అవకాశం ఉంది. టెలివిజన్ అనేది ఎయిర్ కండీషనర్ లేదా హీటర్ వంటి సీజనల్ ఎలక్ట్రానిక్ వస్తువు కాదు కాబట్టి సంవత్సరం పొడుగూతా మీ ఎలక్ట్రిసిటీ బిల్లు పెరుగుతూనే ఉంటుంది. మొత్తంగా చూసుకుంటే ఏడాదికి రూ.1200కు పైగా డబ్బులు మీరు అనవసరంగా వెచ్చించాల్సి వస్తుంది. అందుకే జేబుకు చిల్లు పడకుండా ఉండాలంటే ఎప్పుడూ కూడా టీవీని రిమోట్ తో ఆఫ్ చేయకుండా మెయిన్ స్విచ్ దగ్గర ఆఫ్ చేయండి.

Post a Comment

0 Comments

Close Menu