Ad Code

ప్రైవసీ పాలసీకి యాపిల్ బాటలో గూగుల్‌

 


ఐఫోన్లకు అందించే యూజర్ ప్రైవసీను ఆండ్రాయిడ్‌ స్మార్ట్ ఫోన్లకు తెచ్చేందుకు గూగుల్ ప్రణాళికలను సిద్దం చేస్తోంది. 2021 ఏప్రిల్‌లో ఐఫోన్ల కోసం కొత్త యూజర్ ప్రైవసీ పాలసీని యాపిల్ తీసుకొచ్చింది. దీని సహాయంతో థర్డ్ పార్టీ యాప్స్ సదరు యూజర్‌ను ట్రాక్ చేయకుండా చేసే ఫీచర్ను యాపిల్ అందిస్తోంది. ఇదే ఫీచర్ ను గూగుల్ ఆండ్రాయిడ్ యూజర్లకు తెచ్చే పనిలో పడింది. థర్డ్ పార్టీ యాప్ యూజర్ల డేటాను షేర్ చేసే విషయంలో గూగుల్ కొత్తగా ప్రైవసీ సాండ్ బాక్స్ ఫీచర్ ను తీసుకురానుంది. ప్రైవసీ మార్పుల గురించి ఆండ్రాయిడ్‌ ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్ వైస్ ప్రెసిడెంట్ ఆంథోనీ చవెజ్ ఓ బ్లాగ్‌లో అభిప్రాయాలను వెల్లడించారు. ప్రైవేట్ అడ్వర్టయిజింగ్ సొల్యూషన్లు, కొత్త ప్రైవసీని తీసుకొచ్చేందుకు కొన్ని సంవత్సరాల కార్యక్రమాన్ని మేం ప్రకటిస్తున్నమని చెప్పారు. థర్డ్ పార్టీలతో డేటాను షేర్ చేయడాన్ని తగ్గిస్తామని చెప్పారు. కాగా ఇది ఎప్పటికి అందుబాటులోకి వస్తుందనే విషయాన్ని ఆ సంస్థ ప్రతినిధి చెప్పారు.  ఈ పాలసీల్లో ఈ మార్పులను తీసుకొచ్చేందుకు కనీసం రెండు సంవత్సరాలు పడుతుందని, దీన్ని అమలు చేసేందుకు భాగస్వాములతో కలిసి గూగుల్ పని చేస్తుందని ఆంథోని వెల్లడించారు. ఇప్పటికే కొత్త విధానలను గూగుల్ అందిస్తోంది. వాట్సప్ బ్యాక్ అప్ విషయంలో ఇక గూగుల్ ఫ్రీ సర్వీస్ అందించడం లేదని తెలపింది. ఎక్కువగా ఉపయోగించే గూగుల్ అప్లికేషన్‌లలోనూ గూగుల్ మార్పులు తీసుకొస్తుంది.

Post a Comment

0 Comments

Close Menu