Ad Code

ఆసుస్ నుంచి రెండు ప్రీమియం గేమింగ్​ ఫోన్లు విడుదల


స్మార్ట్​ఫోన్తయారీ సంస్థ ఆసుస్​ ఒకేసారి రెండు గేమింగ్​ ఫోన్లను విడుదల చేసింది. ఆసుస్​ రోగ్​ ఫోన్ 5 ఎస్, రోగ్​ ఫోన్​ 5 ఎస్​ ప్రో​ పేరుతో ఇవి భారత మార్కెట్​లోకి విడుదలయ్యాయి. ఈ రెండు గేమింగ్ స్మార్ట్‌ఫోన్లలో అడ్రినో 660 జీపీయూతో జతచేసిన టాప్-ఎండ్ స్నాప్‌డ్రాగన్ 888+ ఎస్​ఓసీ ప్రాసెసర్​ను అందించింది. దీంతో పాటు 6.78 అంగుళాల ఫుల్ హెచ్​డీ ప్లస్​ శామ్​సంగ్​ AMOLED డిస్‌ప్లేను చేర్చింది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను అందించింది. ఆసుస్​​ రోగ్​ ఫోన్ 5 ఎస్​ సిరీస్​ గ్లోబల్​ మార్కెట్​లోకి గతేడాది ఆగస్టులోనే లాంచ్​ అయ్యింది. ఆసుస్​ ROG ఫోన్ 5s 8జీబీ ర్యామ్​ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ 49,999 వద్ద లభిస్తుంది. ఇక, 12 జీబీ ర్యామ్​ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ. 57,999 వద్ద అందుబాటులో ఉంటుంది. మరోవైపు, ఆసుస్​ ROG ఫోన్ 5s ప్రో రూ. 79,999 ధర వద్ద లభిస్తుంది. వనిల్లా ఆసుస్ ROG ఫోన్ 5s ఫాంటమ్ బ్లాక్, స్టార్మ్ వైట్ కలర్ ఆప్షన్లలో, ROG ఫోన్ 5s ప్రో ఫాంటమ్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లో లభిస్తాయి. వీటి అమ్మకాలు ఫిబ్రవరి 18 నుండి ఫ్లిప్‌కార్ట్ ద్వారా ప్రారంభమవుతాయి. ఆసుస్​ రోగ్​ ఫోన్ 5s, రోగ్​ ఫోన్ 5s ప్రో రెండూ ఆండ్రాయిడ్​11 ఓఎస్​పై పనిచేస్తాయి. ఈ రెండూ 6.78 -అంగుళాల ఫుల్​ హెచ్​డీ ప్లస్​ శామ్​సంగ్​ AMOLED డిస్‌ప్లేతో వస్తాయి. ఈ డిస్​ప్లేలు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్‌ను కలిగి ఉంటాయి. ఆసుస్​ రోగ్​ ఫోన్ 5s ప్రో వెనుక ప్యానెల్‌లో ROG విజన్‌తో కూడిన చిన్న PMOLED డిస్‌ప్లేను కూడా అందించింది. ఈ రెండు ఫోన్లు క్వాల్​కమ్ స్నాప్‌డ్రాగన్ 888+ ఎస్​ఓసీ ప్రాసెసర్​పై పనిచేస్తాయి. కెమెరా విషయానికి వస్తే.. ఆసుస్​ ROG ఫోన్ 5s, రోగ్​ ఫోన్ 5s ప్రో రెండూ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌లను కలిగి ఉంటాయి. ఈ సెటప్​లో 64-మెగాపిక్సెల్ సోనీ IMX686 ప్రైమరీ సెన్సార్, 13 -మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ సెన్సార్, 5 -మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్‌ కెమెరాలను అందించింది. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం, 24 -మెగాపిక్సెల్ సెన్సార్‌ కెమెరాను చేర్చింది. కనెక్టివిటీ ఆప్షన్లను పరిశీలిస్తే.. 5జీ, 4జీ, ఎల్​టీఈ, వైఫై 6, వైఫై డైరెక్ట్, బ్లూటూత్ v5.2, ఎన్​ఎఫ్​సీ, యూఎస్​బీ టైప్-సి పోర్ట్ వంటివి చేర్చింది. ఆన్‌బోర్డ్ సెన్సార్లలో జీఎన్​ఎస్ఎస్​ జీపీఎస్​, గ్లోనాస్, గెలీలియో, బీడౌ, నావిక్, యాక్సిలెరోమీటర్, ఇ-కంపాస్, సామీప్య సెన్సార్, యాంబియంట్ లైట్ సెన్సార్, అండర్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, గైరోస్కోప్, ఎయిర్‌ట్రిగ్గర్ 5, గ్రిప్ ప్రెస్ అల్ట్రాసోనిక్ సెన్సార్లను అమర్చింది. ఆసుస్​ రోగ్​ ఫోన్ 5s, రోగ్​ ఫోన్​ 5s ప్రో రెండూ 6,000mAh బ్యాటరీ ప్యాక్​తో వస్తాయి. ఈ రెండు ఫోన్లు 30W ఫాస్ట్ ఛార్జింగ్​కు మద్దతిస్తాయి.

Post a Comment

0 Comments

Close Menu