Ad Code

శామ్ సంగ్ వాలెంటైన్స్ డే ఆఫర్​!


ప్రపంచవ్యాప్తంగా ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తోన్న వాలెంటైన్స్ వీక్​ ప్రారంభమైంది. ఈ వాలెంటైన్స్​ వీక్​లో ప్రేమికులు ఒకరికొకరు బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అందుకే, ప్రేమికులను ఆకట్టుకునేందుకు శామ్ సంగ్ సంస్థ అదిరిపోయే ఆఫర్ (Offer) తీసుకొచ్చింది. శామ్​సంగ్​ గెలాక్సీ వాచ్​4పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. వాలెంటైన్స్​ డే ఆఫర్​లో భాగంగా గెలాక్సీ వాచ్​ 4 కొనుగోలుపై ఏకంగా రూ. 9,249 తగ్గింపును పొందవచ్చు. అంతేకాదు, అదనంగా రూ. 3000 విలువైన క్యాష్‌బ్యాక్​ కూడా పొందవచ్చు. ఇప్పటికే ప్రారంభమైన ఆఫర్ సేల్​ ఫిబ్రవరి 28న ముగుస్తుంది. Samsung.com/in వెబ్​సైట్​ లేదా శామ్​సంగ్​ ఎక్స్‌క్లూజివ్ స్టోర్లు, రిటైల్ స్టోర్లలో ఆఫర్​ అందుబాటులో ఉంటుంది. శామసంగ్ గెలాక్సీ వాచ్ 4 రెండు కనెక్టివిటీ ఆప్షన్లతో వస్తుంది. బ్లూటూత్, 4జీ కనెక్టివిటీ వెర్షన్లలో లభిస్తుంది. మరోవైపు, 40 ఎంఎం, 42ఎంఎం, 44 ఎంఎం, 46 ఎంఎం డయల్​ సైజ్​లలో అందుబాటులో ఉంటుంది.  వాచ్ 4 (40 ఎంఎం) - రూ. 28,990, వాచ్​ 4 (42 ఎంఎం) క్లాసిక్ రూ. 36,990, వాచ్ 4 (44 ఎంఎం) రూ. 31,990, 4 (46 ఎంఎం) క్లాసిక్ రూ. 39,999 ధర వద్ద అందుబాటులో ఉంటాయి. వాచ్ 4 (40 ఎంఎం) రూ. 23,990, వాచ్​ 4 (42 ఎంఎం) క్లాసిక్ రూ. 31,990, వాచ్ 4 (44 ఎంఎం)- రూ. 26,990, వాచ్ 4 (46 ఎంఎం) క్లాసిక్ రూ. 34,990 ధర వద్ద లభిస్తాయి. వాలైంటైన్స్​ డే ఆఫర్​లో భాగంగా శామ్​సంగ్​ వాచ్​ 4పై రూ. 9,249 డిస్కౌంట్​తో పాటు ఇతర ప్రయోజనాలు కూడా పొందవచ్చు. డిస్కౌంట్​తో పాటు రూ.3999 విలువైన హైబ్రిడ్ లెదర్ బ్యాండ్‌, రూ. 3249 విలువైన ఎక్స్‌ట్రీమ్ స్పోర్ట్స్ బ్యాండ్​లను కేవలం రూ. 999 వద్ద కొనుగోలు చేయవచ్చు. 4జీ కనెక్టివిటీతో కూడిన శామ్​సంగ్​ గెలాక్సీ వాచ్​ 4 బ్లాక్, వైట్, గ్రీన్ అనే మూడు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. బ్లూటూత్​ కనెక్టివిటీ మోడల్​లో గ్రీన్‌ కలర్​కి బదులుగా సిల్వర్ కలర్ ఆప్షన్‌ను పొందుతారు. ఫీచర్ల విషయానికి వస్తే.. శామ్సంగ్ గెలాక్సీ వాచ్ 4 బ్లూటూత్ వెర్షన్ 5.0 వేర్ ఓఎస్‌పై పనిచేస్తుంది. బాడీ కంపోజిషన్, స్లీప్ ప్యాటర్న్, డైలీ యాక్టివిటీ, ఫిట్‌నెస్ ట్రాకింగ్, బ్లడ్ ఆక్సిజన్ లెవెల్‌ వంటివి ట్రాక్ చేయడానికి దీనిలో హెల్త్, వెల్‌నెస్ ఫీచర్లను అందించింది. మరోవైపు, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్​ గల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను చేర్చింది. కరోనా- విజృంభిస్తున్న ప్రస్తుతం తరుణంలో హెల్త్, ఫిట్‌నెస్ ట్రాక్​ చేసుకోవడం ప్రతి ఒక్కరికి అవసరంగా మారింది. అందుకే, స్మార్ట్​వాచ్​లకు, ఫిట్​నెట్​ పరికరాలకు డిమాండ్​ అమాంతం పెరిగింది.

Post a Comment

0 Comments

Close Menu