Ad Code

పోకో ఎక్స్​4 ప్రో 5జీ స్మార్ట్​ఫోన్​ విడుదల !


ప్రముఖ స్మార్ట్​ఫోన్​ తయారీ సంస్థ పోకో నుంచి మరో మిడ్​రేంజ్​ ఫోన్ రిలీజైంది. పోకో తన పోకో X4 ప్రో 5Gని  గ్లోబల్​ మార్కెట్​లోకి లాంచ్​ చేసింది. MWC 2022 ఈవెంట్​లో పోకోM4 ప్రోతో పాటే పోకో X4 ప్రో 5జీని కూడా ఆవిష్కరించింది. పోకో X4 ప్రో 5జీ అదిరిపోయే ఫీచర్లతో వచ్చింది. దీనిలో రెడ్​మీ 11 ప్రో 5Gతో సమానమైన ఫీచర్లను అందించింది. ఈ స్మార్ట్​ఫోన్ మొత్తం మూడు కలర్​ ఆప్షన్లలో లభిస్తుంది. లేజర్ బ్లూ, లేజర్ బ్లాక్, ఎల్లో కలర్స్​లో అందుబాటులో ఉంటుంది. మరోవైపు, పోకో X4 ప్రో 5G మొత్తం రెండు స్టోరేజ్ ఆప్షన్లలో లభిస్తుంది. 6GB ర్యామ్​/ 128GB స్టోరేజ్, 8GB ర్యామ్​ /256GB స్టోరేజ్​ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. 6 జీబీ ర్యామ్​ మోడల్​ EUR 299 (సుమారు రూ. 25,000) వద్ద, 8 జీబీ ర్యామ్​ మోడల్​ EUR 349 ​​(సుమారు రూ. 30,000) ధర వద్ద లభిస్తాయి. భారత మార్కెట్​లో పోకో X4 ప్రో 5G అమ్మకాలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. పోకో X4 ప్రో 5G 120Hz రిఫ్రెష్ రేట్, 1080×2400 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.67 అంగుళాల పూర్తి-HD+ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. దీనిలో క్వాల్​కామ్​ స్నాప్​డ్రాగన్​ 695 5G చిప్‌సెట్​ను అమర్చింది. పోకో X4 ప్రో 5G ఆండ్రాయిడ్​11 ఆధారిత MIUI 13 పై నడుస్తుంది. దీనిలో 67W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 5,000mAh బ్యాటరీని అమర్చింది. ఇక, కెమెరా విషయానికి వస్తే.. X4 ప్రో 5G వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్‌ను అందించింది. ఇందులో భారీ 108MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ లెన్స్, 2MP మాక్రో షూటర్ కెమెరాలు ఉంటాయి. దీని ముందు భాగంలో సెల్ఫీలు, వీడియో చాట్‌ల కోసం ప్రత్యేకంగా 16MP స్నాపర్‌ కెమెరాను కూడా చేర్చింది. అదనంగా, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఒక IR బ్లాస్టర్, 3.5mm ఆడియో జాక్, డ్యూయల్ స్టీరియో స్పీకర్లను అందించింది.

Post a Comment

0 Comments

Close Menu