మాస్క్ వేసుకున్నాఫేస్‌లాక్ ఓపెన్!


కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచంలో అందరూ మాస్కులు ధరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో యాపిల్ సంస్థ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ క్రమంలో తమ ఐఫోన్‌లలో ఫేస్ లాక్ పెట్టుకున్న వారు లాక్ తీసేందుకు మాస్కు తీయాల్సి వస్తోంది. ఇకపై ఇలాంటి సమస్య లేకుండా మాస్కు ధరించినా కూడా ఫేస్ లాక్ ఓపెన్ అయ్యేలా యాపిల్ ఒక ఫీచర్ తీసుకొచ్చింది. ఈ ఫీచర్‌తో ఉన్న ఐఓఎస్ 15.4 అప్‌డేట్‌ను తాజాగా విడుదల చేసింది. ఇది ఐఫోన్ 12, 13 సిరీసుల్లో అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. కళ్ల చుట్టూ ఉంటే ప్రత్యేక లక్షణాలను ఈ ఫీచర్ స్కాన్ చేస్తుందని, తద్వారా ఆథెంటికేట్ చేసి మాస్కు ఉన్న కూడా లాక్ ఓపెన్ చేస్తుందని వివరించింది. ఈ కొత్త అప్‌డేట్‌లో ఈ కొత్త ఫీచర్‌తోపాటు ఎయిర్‌ట్యాగ్ సెటప్ సమయంలో సేఫ్టీ మెసేజ్‌లు కూడా అందుబాటులో ఉంటాయని సమాచారం.

Post a Comment

0 Comments