Header Ads Widget

రెడ్​మీ నుంచి మరో స్మార్ట్​వాచ్ విడుదల !


షియోమి సబ్-బ్రాండ్ రెడ్​మీ కేవలం స్మార్ట్​ఫోన్ మార్కెట్​లోనే స్మార్ట్ వాచ్​ మార్కెట్​లోనూ దూసుకుపోతుంది. ఇందులో భాగంగా తాజాగా రెడ్​మీ నోట్​ 11 ప్రో, రెడ్​మీ నోట్​ 11 ప్రో ప్లస్​ స్మార్ట్​ఫోన్లతో పాటుగా రెడ్​మీ వాచ్​2 లైట్ అనే సరికొత్త స్మార్ట్‌వాచ్‌ని కూడా విడుదల చేసింది. బెంగళూరులో జరిగిన రెడ్​మీ ఫిజికల్ ఆఫ్‌లైన్ ఈవెంట్​లో దీన్ని ఆవిష్కరించింది. రెడ్‌మీ వాచ్ 2 లైట్ సరసమైన స్మార్ట్‌వాచ్​గా మార్కెట్​లోకి వచ్చింది. దీనిలో బడ్జెట్​ ధరలోనే అద్భుతమైన ఫీచర్లను అందించింది.ఈ స్మార్ట్​వాచ్​ అమ్మకాలు భారత్​లో మార్చి 15 నుండి ప్రారంభమవుతాయి. రెడ్​మీ వాచ్​ 2 లైట్ భారతదేశంలో రూ. 4,999 వద్ద ప్రారంభమవుతుంది. భారతదేశంలోని ఇతర ఆఫ్‌లైన్ రిటైలర్లతో పాటు అమెజాన్​, షియోమి వెబ్​సైట్లు, Mi హోమ్ స్టోర్‌లలో అందుబాటులో ఉంటుంది. రెడ్‌మీ వాచ్ 2 లైట్ బ్లాక్, బ్లూ, ఐవరీ అనే మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ స్మార్ట్ వాచ్‌లోని పట్టీలు బ్లాక్​, బ్లూ, బ్రౌన్, ఐవరీ, ఆలివ్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటాయి. రెడ్​మీ వాచ్ 2 లైట్1.55-అంగుళాల TFT డిస్ప్లేతో వస్తుంది. ఇది HD రిజల్యూషన్, 120 కంటే ఎక్కువ వాచ్ ఫేస్‌లను కలిగి ఉంటుంది. బ్లడ్​ ఆక్సిజన్ గాఢతను ట్రాక్ చేయడానికి SpO2 సెన్సార్, హృదయ స్పందన మానిటర్‌ ఫీచర్లను అందించింది. ఇది​ స్లీప్, స్ట్రెస్ మానిటరింగ్​కు మద్దతిస్తుంది. 100 కంటే ఎక్కువ ఫిట్‌నెస్ మోడ్‌లను కలిగి ఉంటుంది. ఇది మహిళలు వారి పీరియడ్స్ ట్రాక్ చేయడానికి రుతుచక్రం ట్రాకింగ్ ఫీచర్‌తో కూడా వస్తుంది. రెడ్‌మి వాచ్ 2 లైట్ ఇన్‌బిల్ట్ జీపీఎస్​ ఫీచర్​ను కలిగి ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ అవసరం లేకుండా జీపీఎస్​ ద్వారా లొకేషన్​ ట్రాక్​ చేయగలదు. రెడ్​మీ నోట్​11 ప్రో, రెడ్​మీ నోట్​ 11 ప్రో ప్లస్​ భారత మార్కెట్​లోకి రిలీజయ్యాయి. భారతదేశంలో రెడ్​మీ నోట్ 11 ప్రో బేస్ 6GB + 128GB వేరియంట్ రూ. 17,999 నుండి ప్రారంభమవుతుంది. ఈ ఫోన్ 8GB RAM మోడల్ రూ. 19,999 వద్ద లభిస్తుంది. మరోవైపు, రెడ్​మీ నోట్ 11 ప్రో ప్లస్​ బేస్ 6GB + 128GB మోడల్ రూ. 19,999 ధర వద్ద లభిస్తుంది. అయితే, 8GB + 128GB వేరియంట్ రూ. 21,999 వద్ద, 8GB + 256GB వేరియంట్​ రూ. 23,999 వద్ద లభిస్తాయి. వీటి విక్రయాలు భారత్​లో మార్చి 23న ప్రారంభమవుతాయి.

Post a Comment

0 Comments