Ad Code

వాట్సాప్ లో సరికొత్త ఫీచర్లు !


వాట్సాప్ ఈ ఏడాది మరిన్ని లేటెస్టు ఫీచర్లను పరిచయం చేసే దిశగా ప్లాన్ చేస్తోంది. గ్రూప్స్ కు సంబంధించి వాట్సాప్ ఆకట్టుకునే ఫీచర్లను ప్రకటించింది. వేర్వేరు గ్రూప్స్ లోని మెంబర్స్ కు ఒకే చోట కమ్యూనికేట్ అయ్యేలా కమ్యూనిటీస్ ఫీచర్ ను తీసుకువస్తున్నట్లు వాట్సాప్ ప్రకటించింది. అంతేకాదు గ్రూప్స్ కోసం అడ్మిన్ డిలీట్, లార్జ్ వాయిస్ కాల్స్, మెసేజ్ రియాక్షన్లు, లార్జ్ ఫైల్ షేరింగ్ , ఏమోజీలు అనే ఐదు కొత్త ఫీచర్లను కూడా వాట్సాప్ ఆవిష్కరించింది. కమ్యూనిటీస్ ఫీచర్ సాయంతో యూజర్లు మొత్తం కమ్యూనిటీ పంపిన అప్ డేట్లను తీసుకోవచ్చు. ముఖ్యమైన అప్ డేట్లపై స్మాల్ డిస్కషన్ గ్రూప్స్ ఆర్గనైజ్ చేయవచ్చని వాట్సాప్ తెలిపింది. ఈ ఫీచర్ అడ్మిన్ల కోసం కొత్త టూన్స్ కూడా తీసుకురానుంది. ఇందులో అందరికీ పంపే అనౌన్స్ మెంట్ మెసేజెస్ విషయంలో ఏయే గ్రూపులను చేర్చవచ్చో అడ్మిన్లే నిర్ణయం తీసుకోవచ్చు. ఈ ఫీచర్ తో స్కూళ్లు, లోకల్ క్లబ్బులు, ఇతర సంస్థలు ఒకే తాటిపైకి సులభంగా వచ్చేలా చేయాలని లక్ష్యంగా వాట్సాప్ పెట్టుకుంది. దీనివల్ల కమ్యూనికేషన్ గ్యాప్ అనేది రాదు. గ్రూప్ కోసం రియాక్షన్లు, అడ్మిన్ డిలీట్, ఫైల్ షేరింగ్, లార్జ్ వాయిస్ కాల్స్ అనే కొత్త ఫీచర్లను కూడా జోడిస్తుంది వాట్సాప్ . కొత్త మెసేజ్ లతో పాటు చాట్ లను ముంచెత్తకుండా యూజర్లు తమ అభిప్రాయాలను తొందరగా షేర్ చేసుకోవడానికి వాట్సాప్ ఎమోజీ రియాక్షన్లను తీసుకొస్తోంది. అయితే మెసేజ్ కు రియాక్ట్ కావాలి అంటే గ్రూప్ లో ఎవరైనా ఒక మెసేజ్ పంపించాల్సి ఉంటుంది. గ్రూప్ అడ్మిషన్లను ప్రతి ఒక్కరి చాట్ నుంచి వివాదాస్పద, ఇబ్బందికర, తప్పుడు, ప్రాబ్లమ్ మెసేజ్ లను డిలీట్ చేయడానికి అనుమతి ఇస్తుంది. గ్రూప్ అడ్మిన్ వీటిని ఎప్పుడైనా డిలీట్ చేయవచ్చు. యూజర్లు 2జీబీ వరకు సైజు ఉన్న ఫైల్స్ ను షేర్ చేసుకునేలా ఫైల్ షేరింగ్ లిమిట్ ను కూడా వాట్సాప్ ఎక్సె టెండ్ చేస్తోంది. వాట్సాప్ గతంలో 4 నుంచి 8 మందికి గ్రూప్ కాల్స్ చేసేందుకు పర్మిషన్ ఉండేది. ఇప్పుడు వాట్సాప్ ద్వారా ఒకేసారి 32 మంది సభ్యులకు వాయిస్ కాల్స్ చేసేందుకు అనుమతిస్తోంది. వాయిస్ కాల్స్ ఇంటర్ ఫే్ ను కూడా వాట్సాప్ రీడిజైన్ చేసింది. ఈ ఫీచర్లు కొద్దివారాల్లోనే అందుబాటులోకి రానున్నట్లు వాట్సాప్ వెల్లడించింది. బీటా యూజర్లు వీటిని అందరికంటే ముందే వాడొచ్చు. ఈ ఫీచర్లు మొదటగా బీటా యూజర్లకు అందుబాటులోకి రానున్నాయి. ఆ తర్వాతే రెగ్యులర్ యూజర్లకు అందుబాటులోకి వస్తాయి.

Post a Comment

0 Comments

Close Menu