Ad Code

హోండా కంపెనీ నుంచి ప్లెక్స్‌ ఫ్యూయల్‌ కమ్యూటర్‌ మోటార్‌ సైకిల్‌


ప్లెక్స్‌ ఫ్యూయల్‌ కమ్యూటర్‌ మోటార్‌ సైకిల్‌ను రూపొందిస్తున్నట్లు హోండా మోటార్‌ సైకిల్‌ అండ్‌ ఇండియా ప్రకటించింది. దేశంలో రెండో అతిపెద్ద ద్విచక్ర వాహనాల కంపెనీ అయిన హోండా మోటార్‌ తీసుకున్న అతిపెద్ద నిర్ణయం ఇది. హోండా ఇప్పటికే బ్రెజిల్‌లో ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ మోటార్‌ సైకిళ్లను విక్రయిస్తోంది. ఫ్లెక్స్‌ ప్యూయల్‌ ఇంజిన్లతో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బైక్‌లను భారత్‌లో విడుదల చేయాలని భావిస్తున్నట్లు హోండా మోటార్‌ తెలిపింది. ఈ ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ ఇంజిన్లు పెట్రోల్‌, ఇథనాల్‌  రెండింటితో నడుస్తాయి. హోండా ఈ వాహనాలను మార్కెట్లోకి తీసుకువస్తే టీవీఎస్‌ మోటారు తర్వాత ఈ బ్రాండ్‌ తీసుకు వచ్చిన రెండో కంపెనీగా నిలువనుంది. టీవీఎస్‌ కంపెనీ నుంచి ఇప్పటికే ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ ఇంజిన్‌తో తయారు చేసిన బైకు అపాచీ ఆర్‌టీఆర్‌200 ఎఫ్‌ఐ ఈ100ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఫ్లెక్స్ ఇంధన ఇంజిన్‌లతో వాహనాల ట్యాంకులకు వివిధ రకాల ఇంధనాలను జోడించవచ్చు. వాహనాన్ని పెట్రోల్, పెట్రోల్ తోపాటు ఇథనాల్ మిశ్రమాన్ని ఏ నిష్పత్తిలోనైనా లేదా స్వచ్ఛమైన ఇథనాల్‌తో నడపవచ్చు. దీని కోసం పెట్రోల్ ఇంజిన్‌లో ఇంధన పంపు, నియంత్రణ మాడ్యూల్‌లో మార్పులు చేస్తారు. అయితే ఈ ఇంజిన్‌లో ఉపయోగించే ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ ధర రూ. 60-62 ఉంటుంది. అంటే లీటరుకు రూ. 35-40 ఆదా చేసుకోవచ్చు. శిలాజ ఇంధనాలపై ఆధారపడటం తగ్గుతుంది. దేశంలో కాలుష్య స్థాయి కూడా తగ్గుతుంది. త్వరలో మరిన్ని ఎలక్ట్రిక్‌ బైక్‌లను విడుదల చేస్తామని హోండా కంపెనీ వెల్లడించింది. వీటిని తయారు చేసేందుకు హోండా మోటారు తన కంపెనీకి చెందిన ఇతర సబ్సిడరీల నుంచి సాయం పొందనుంది. అయితే ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ ఇంజిన్‌తో నడిచే హోండా సీజీ150 టైటాన్‌ మిక్స్‌ను 2009లో బ్రెజిల్‌లో విడుదల చేసింది. ఈ బైక్‌ పెట్రోల్, ఇథనాల్‌ రెండింటితో నడుస్తుంది. ఆ తర్వాత ఎన్‌ఎక్స్ఆర్ 150, బ్రోస్ మిక్స్, బీఐజెడ్ 125 ఫ్లెక్స్‌ బైకులను హోండా బ్రెజిల్‌లో ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజిన్లతో విడుదల చేసింది.

Post a Comment

0 Comments

Close Menu